Japan Earthquake: జపాన్‌లో రెండు భారీ భూకంపాలు.. రిక్టారు స్కేల్‌పై 6.9, 7.1 నమోదు..! సునామీ హెచ్చరికలు జారీ..

 Japan Tsunami Warning : ఈరోజు దక్షిణ జపాన్‌లోని క్యుషు ద్వీపంలో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత 7.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. వివరాలు తెలియాల్సి ఉంది. జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు జపాన్‌ దక్షిణ జపాన్‌లో భారీ భూకంపం ప్రకంపనాలు ఏర్పడ్డాయి.  

Written by - Renuka Godugu | Last Updated : Aug 8, 2024, 03:30 PM IST
Japan Earthquake: జపాన్‌లో రెండు భారీ భూకంపాలు.. రిక్టారు స్కేల్‌పై 6.9, 7.1 నమోదు..! సునామీ హెచ్చరికలు జారీ..

 Japan Tsunami Warning : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు జపాన్‌ దక్షిణ జపాన్‌లో భారీ భూకంపం ప్రకంపనాలు ఏర్పడ్డాయి.  జపాన్‌ మెటిరియాలాజికల్‌ ఏజెన్సీ ప్రకారం రిక్టారు స్కేల్‌పై 7.1 నమోదు అయింది. జపాన్‌ దక్షిణ ద్వీపం అయితే, క్యుష్యూ తీరానికి సుమారు 30 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

ఈరోజు దక్షిణ జపాన్‌లోని క్యుషు ద్వీపంలో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత 7.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. వివరాలు తెలియాల్సి ఉంది. రిక్టారు స్కేల్‌ పై 7.1 నమోదు అయింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ భూప్రకంపనాలు నైరుతి జపాన్‌ ద్వీపమైన క్యూషు, షికోకులో చోటు చేసుకుంది. మొదటగా రిక్టారు స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది ఆ తర్వాత 7.1 నమోదు అయింది.  అలలు ఒక మీటరు ఎత్తులో ఎగిసిపడవచ్చని జపాన్‌ మెటిరియాలాజికల్‌ ఏజెన్సీ తెలిపింది. 

జపనీస్‌ ప్రభుత్వం సహాయక చర్యలు కూడా చేపట్టింది. రంగంలోకి సహాయక బృందాలను దింపింది. అంతేకాదు ఎట్టిపరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లకూడదని ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా జపాన్‌ వాతావరణ శాఖ షేర్‌ చేసింది. అంతేకాదు జపాన్‌ పబ్లిక్‌ టెలివిజన్స్‌లో మియాజకి ఏయిర్‌ పోర్టు కిటికి అద్దాలు ఇతర ఇల్లు ధ్వంసం అయిన దృశ్యాలు కనిపించాయి. ప్రపంచంలోనే జపాన్‌లో అత్యధికంగా భూకంపాలు చోటు చేసుకుంటాయి.  అందుకే  ఈ దేశాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. 2011 మార్చిలో కూడా భూకంపాల ధాటికి జపాన్‌ ఈశాన్య తీర ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దాదాపు 20 వేల మంది ప్రాణాలను కోల్పోయారు. జనవరిలో 7.6 రిక్టారు స్కేలు నమోదు అవ్వగా 241 మంది చనిపోయారు.

ఈ రోజు సంభవించిన ఈ రెండు భారీ భూకంపాలు ఒక్కసారిగా జపనీయులను భయబ్రాంతులకు గురిచేశాయి. క్యూషూ ద్వీపంలో ఒక్క మీటరు ఎత్తులో అలలు ఎగసిపడవచ్చని అలెర్ట్‌ చేశారు. దీంతో ఇల్లు, ఆఫీసులు వదిలేసి అందరూ రోడ్డుపైకి చేరుకున్నారు. ఈ భూకంపం తీవ్రత 6.9,7.1 రికార్డు కాగా ఒక్కసారిగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.

ఇదీ చదవండి: గెయిల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ డైరెక్ట్‌ లింక్‌ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి..!  

 

ఇదీ చదవండి: నాగార్జున సాగర్‌ టూర్‌ ప్యాకేజీ కేవలం రూ.800.. ఇంకా ఎన్నో చూడవచ్చు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News