Haiti Gas Tanker Explosion: గ్యాస్ ట్యాంకర్ పేలి 50మంది సజీవ దహనం, హైతీలో ఘటన

Haiti Gas Tanker Explosion: గ్యాస్ ట్యాంకర్ పేలి 50 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన కరేబియన్ ద్వీప దేశం హైతీలో చోటుచేసుకుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 08:05 PM IST
Haiti Gas Tanker Explosion: గ్యాస్ ట్యాంకర్ పేలి 50మంది సజీవ దహనం, హైతీలో ఘటన

Haiti Gas Tanker Explosion: హైతీ(Haiti)లో ఘోర ప్రమాదం జరిగింది. కేప్​-హైతియన్(Cap-Haitien)​ నగరంలో​ మంగళవారం ఉదయం గ్యాస్ ట్యాంకర్ పేలి(Gas Tanker Explosion) 50 మంది సజీవ దహనమయ్యారు. అనేక మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక డిప్యూటీ మేయర్‌ పాట్రిక్ అల్మోనోర్(Deputy Mayor Patrick Almonor) వెల్లడించారు. 

Also Read: Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.6 తీవ్రత భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు జారీ

''సంఘటనా స్థలంలో 50-54 మంది సజీవ దహనాన్ని చూశాను'' అని పాట్రిక్ అల్మోనోర్ పేర్కొన్నారు. పేలుడు ధాటికి దాదాపు 20 ఇళ్లు  దగ్దమైనట్లు ఆయన చెప్పారు. మృతుల సంఖ్యను ఇప్పుడే చెప్పలేమన్నారు. కాగా ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని ఏరియల్​ హెన్రీ(Prime Minister Ariel Henry) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇళ్లల్లో చిక్కుకుపోయి మరణించినవారితో కలిపి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News