US Tornado: అమెరికాలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. ఈ టోర్నడోలు మిస్సిస్సిప్పి మరియు అలబామా ప్రాంతాలలో భీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో 25 మంది దుర్మరణం చెందారు. కొందరు గల్లంతు అవ్వగా.. వందలాది మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ సుడి గాలి ధాటికి ఇల్లు, దుకాణాలు, ఇతర ఆస్తులు నేలమట్టమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈ టోర్నడోలు ఈశాన్య జాక్సన్, మిస్సిస్సిప్పిలో 96 కిలోమీటర్ల మేర నష్టం చేశాయి. గ్రామీణ పట్టణాలైన రోలింగ్ ఫోర్క్, సిల్వర్ సిటీల్లో ఈ సుడిగాలులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఇళ్ల బయట పార్కు చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. రహదారులన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఇప్పటికే రెస్క్యూ టీం టోర్నడోల ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ టోర్నడోల కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని దేశ అధ్యక్షుడు జో బిడెన్ తెలపారు. "నా నగరం పోయింది" అని రోలింగ్ ఫోర్క్ మేయర్ ఎల్డ్రిడ్జ్ వాకర్ ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ తో అన్నారు. టోర్నడోలును అంచనా వేయడం చాలా కష్టం. ఇవి ఎక్కువగా యూఎస్ లోని మధ్య మరియు దక్షిణ ప్రాంతాలలో వస్తాయి.
Also read: Iran Earthquake: ఇరాన్‌ని షేక్ చేసిన భూకంపం.. 165 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK