CIA and Talibans: తాలిబన్లతో అమెరికా సీఐఏ రహస్య సమావేశం..రహస్య ఒప్పందమా

CIA and Talibans: ఆఫ్ఙనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు అమెరికాకు మధ్య రహస్య ఒప్పందం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా నిఘా ఏజెన్సీ సీఐఏకు తాలిబన్లకు మధ్య రహస్య సమావేశం జరిగినట్టు వెల్లడవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 25, 2021, 10:57 AM IST
CIA and Talibans: తాలిబన్లతో అమెరికా సీఐఏ రహస్య సమావేశం..రహస్య ఒప్పందమా

CIA and Talibans: ఆఫ్ఙనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు అమెరికాకు మధ్య రహస్య ఒప్పందం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా నిఘా ఏజెన్సీ సీఐఏకు తాలిబన్లకు మధ్య రహస్య సమావేశం జరిగినట్టు వెల్లడవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్‌ను(Afghanistan) తాలిబన్లు చాలా సునాయసనంగా హస్తగతం చేసుకున్నారు. ఆఫ్ఘన్ సైన్యం నుంచి ఏ మాత్రం ప్రతిఘటన లేకపోగా..అమెరికా సైన్యం పూర్తిగా ఆ దేశం నుంచి వైదొలగకుండానే తాలిబన్లు ఆక్రమించడంపై ఇప్పటికే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించిన అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థ సీఐఏ-తాలిబన్ల మధ్య రహస్య చర్చ జరిగిందనేది ఈ పత్రిక వెల్లడించిన అంశం.

అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే సీఐఏ ఛీఫ్ బర్న్స్..తాలిబన్ సహ వ్యవస్థాపుడు ముల్లా అబ్దుల్ బరాదర్‌తో మాట్లాడినట్టు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తరువాత ఇది తొలిభేటీ కావడం విశేషం. తాలిబన్ కీలకనేతలతో జో బిడెన్(Joe Biden)ప్రభుత్వం చేపట్టిన అత్యున్నత స్థాయి చర్చలుగా భావిస్తున్నారు.తాలిబన్ల నియంత్రణలో ఉన్న ఆఫ్ఘన్ నుంచి వేలాదిమంది ప్రజల్ని తరలించే ప్రయత్నాలు జరుగుతున్న నేపధ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పాలనలో సీఐఏ ఛీఫ్ బర్న్స్ అత్యంత అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా పేరుంది. అటు బరాదర్ తాలిబన్ల(Talibans)లో అత్యంత కీలకమైన నేతగా ఉన్నారు. ఏ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందనేది తెలియలేదు. మరోవైపు కాబూల్ విమానాశ్రయం(Kabul Airport)నుంచి అమెరికా సైనిక బలగాల తరలింపు, అమెరికన్ల తరలింపు ప్రక్రియను ఆగస్టు 31 డెడ్‌లైన్ విధించారు తాలిబన్లు. ప్రజల తరలింపుపై సమీక్షించేందుకు జీ 7 దేశాలైన బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా దేశాలు వర్చువల్‌గా సమావేశం కానున్నాయి.

Also read: తాలిబన్ల వికృత చేష్టలు: వేశ్యగృహాల్లో నోరు లేని మూగ జీవాలు.. వాటితోనే లైంగిక వాంఛ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News