USA: ''అమెరికాలో వరుసగా షాకింగ్ ఘటనలు..." .. అనుమానాస్పదంగా మృతి చెందిన మరో భారతీయ విద్యార్థి..

America News: న్యూయార్క్‌లోని ఇండియన్ మిషన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది.  శ్రేయాస్ రెడ్డి బెనిగర్ మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఈ ఏడాదిలో వెలుగు చూసిన నాల్గవకేసు.

Last Updated : Feb 2, 2024, 01:33 PM IST
  • - అమెరికాలో టెన్షన్ వాతావరణం..
    - నలుగురు భారతీయ సంతతి విద్యార్థుల మృతి..
    - ఆందోళనలో ఇండియన్స్ తల్లిదండ్రులు
USA: ''అమెరికాలో వరుసగా షాకింగ్ ఘటనలు..." .. అనుమానాస్పదంగా మృతి చెందిన మరో భారతీయ విద్యార్థి..

Indian Origin Student Dies: కొన్నిరోజులుగా అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జాత్యహాంకారణ ధోరణి కల్గి ఉండి, కొందరు దాడులకు పాల్పడుతుంటారు. గతంలోకూడా అనేక మంది భారతీయ సంతతికి  చెందిన విద్యార్థులను, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారిని హతమార్చిన సంఘటనలు అనేకం జరిగాయి.

తాజాగా, మరల ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం తీవ్ర దుమారంగా మారింది. భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు మృతి చెందిన తీవ్ర కలకలంగా మారింది. బెనిగర్ ఒహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ లో హైదరాబాద్ కు చెందిన 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతని స్కూల్ వద్ద శ్రేయస్ రెడ్డి  చనిపోయి విగత జీవిగా కన్పించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

శ్రేయాస్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారని, అయితే అతని వద్ద అమెరికా పాస్‌పోర్ట్ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఎటువంటి ద్వేషపూరిత నేరం జరిగే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఈ ఘటన పట్ల న్యూయార్క్‌లోని ఇండియన్ మిషన్ వేదనను వ్యక్తం చేసింది.  బెనిగర్ మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.  

గతంలో జరిగిన కొన్ని ఘటనలు.. ఈ వారం ప్రారంభంలో, నీల్ ఆచార్య - పర్డ్యూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి - శవమై కనిపించాడు.  మరో కేసులో, హర్యానాలోని పంచకుల నివాసి అయిన వివేక్ సైనీని జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో నిరాశ్రయుడైన వ్యక్తి కొట్టి చంపాడు. మరో భారతీయ విద్యార్థి అకుల్ ధావన్ జనవరిలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ (UIUC) వెలుపల శవమై కనిపించాడు. USలో దాదాపు.. 300,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News