Afghanistan Brave Girl Qamar Gul: ఉగ్రవాదుల ఆగడాలు ఎలా ఉంటాయో ప్రపంచమంతటా తెలుసు.. వారు వచ్చిరాగానే రాగానే అమాయకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అనేక మందిని పొట్టన బెట్టుకుంటారు. అయితే ఇలాంటి ఘటనలో తన తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్న తాలిబన్ ఉగ్రవాదుల ( taliban terrorists ) పై ఆ బాలిక భయపడకుండా ఏకే 47 గన్ చేత పట్టుకుని సివంగిలా దూకింది. ఆమె ధాటికి ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సంఘటన జూలై 17న ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan ) లోని సెంట్రల్ ఘోర్ (Ghor) ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో జరిగింది. Also read: Covid19 Vaccine: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పేరేంటో తెలుసా?
16ఏళ్ల వయసున్న ఈ సాహస బాలిక పేరు కమర్‌గుల్ ( Qamar Gul ).. ఆమె తండ్రి గ్రామ పెద్ద, ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నాడన్న నేపంతో..అర్థరాత్రి ఉగ్రవాదులు వారింటికి వచ్చి అర్థరాత్రి తలుపుతట్టారు. మొదట ఆమె అమ్మ తలుపు తీసి చూడగా.. ఉగ్రవాదులని తెలియడంతో ఆమె వారిని అడ్డుకుంది. దీంతో ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపి చంపారు. ఆ తర్వాత కమర్‌గుల్ తండ్రిని చంపారు. ఇది చూసిన కమర్‌గుల్ ఏకే 47 చేతపట్టుకుని ఉగ్రవాదులపై సివంగిలా విరుచుకుపడింది. ఒక పక్క తన తమ్ముడిని కాపాడుకుంటూనే.. ఉగ్రవాదులపై గంటపాటు బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో ఉగ్రవాదులు ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. కమర్‌గుల్ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. Also read: Serum Institute: కోవిడ్ 19 వ్యాక్సిన్ తేదీ, ధర నిర్ణయం
అయితే కమర్‌గుల్ దాడితో ఖంగుతిన్న ఉగ్రవాదులు మళ్లీ ఆమె కోసం గ్రామానికి చేరుకున్నారు. ఇంతలో సంఘటన ప్రదేశానికి చేరుకున్న స్థానికులు, ప్రభుత్వ మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత కమర్‌గుల్ ఆమె సోదరుడిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లినట్లు ప్రావిన్స్ గవర్నర్ ప్రతినిధి మహ్మద్ ఆరిఫ్ అబార్ తెలిపారు. ఇదిలాఉంటే.. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ( Ashraf Ghani ) కూడా ఈ సాహస బాలికను అభినందించి తన భవనానికి రావాలని ఆహ్వానించారు. ప్రస్తుతం ఆ బాలిక, ఆమె తమ్ముడు ఇద్దరు సురక్షిత ప్రదేశంలో ఉన్నారు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే కమర్‌గుల్ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె మిషన్ గన్ చేతపట్టుకుని ఉన్న ఫొటో బాగా వైరల్ అవుతోంది. Also read: Oxford Vaccine: ఆ వ్యాక్సిన్ లో సగం భారత్ కే