America: అక్కడ కుక్కలకే మేయర్ పదవి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కెంటకీలోని రాబిట్ హాష్ పట్టణం ఓ కుక్కను మేయర్ గా ఎన్నుకుంది. విల్బర్ బీస్ట్ ఆ కుక్క పేరు..సారీ..ఆ మేయర్ పేరు.

Last Updated : Nov 5, 2020, 01:44 PM IST
America: అక్కడ కుక్కలకే మేయర్ పదవి

అమెరికా అధ్యక్ష ఎన్నికల( America president elections ) నేపధ్యంలో  కీలక పరిణామం చోటుచేసుకుంది. కెంటకీలోని రాబిట్ హాష్ పట్టణం ఓ కుక్కను మేయర్ గా ఎన్నుకుంది. విల్బర్ బీస్ట్ ఆ కుక్క పేరు..సారీ..ఆ మేయర్ పేరు.

అమెరికాలో ఏదైనా సాధ్యమే. అనుకుంటే ఏదైనా చేయగలరేమో. అందుకే ఓ కుక్కను తీసుకొచ్చి మేయర్ గా నిలబెట్టారు. నెగ్గించారు. ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే..కీలక పరిణామం చోటుచేసుకుంది. కెంటకీ ( Kentucky ) రాష్ట్రంలోని రాబిట్ హాష్ అనే ఓ చిన్న పట్టణం వైవిద్యాన్ని ప్రదర్శించింది. తమ పట్టణానికి మేయర్ ( Mayor ) గా ఓ కుక్కను ఎన్నుకుంది. 

విల్బర్ బీస్ట్ ఆ కుక్క పేరు. ఆ పట్టణం మేయర్ పేరిది. ఈ ఎన్నికల్లో 13 వేల 143 ఓట్ల తేడాతో విల్బర్ బీస్ట్ మేయర్ గా గెలుపొందింది. రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 22 వేల 985 ఓట్లు పోలయ్యాయి. విశేషమేమంటే పోటీలో అన్నీ కుక్కల్నే నిలబెట్టారు ఇక్కడి ప్రజలు. జాక్ రాబిట్ బీగల్, గోల్డెన్ రిట్రీవర్ అనే మరో రెండు కుక్కలకు 2, 3 స్థానాలు దక్కాయి. 

ఒహియో ( Ohio )  నదీ తీరం వెంబడి ఉన్న ఈ పట్టణంలో 1990 నుంచి కుక్కనే మేయర్ గా ఎన్నుకునే సాంప్రదాయం ప్రారంభమైంది. ఓటు వేయడమే కాకుండా హిస్టారికల్ సొసైటీకు 1 డాలర్ విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. కెంటకీ రాష్ట్రంలో మూలన విసిరేసినట్టుండే ఈ పట్టణాన్ని రక్షించడానికి వినూత్న తరహాలో కార్యక్రమాలు చేస్తుంటారు. సందర్శకులకు స్వాగతం పలుకుతుంటుంది ఈ పట్టణం. Also read: Joe Biden: ఈ విజయం దేశ ప్రజలందరిదీ..

Trending News