Lizard: 7వేల కి.మీ ప్రయాణించిన బల్లి... ఎలా సాధ్యమైందంటే...

Lizard travels over 7000 km : అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఇంగ్లాండ్‌లోని ఓర్లాండో వరకు దాదాపు 7వేల కి.మీ దూరం ప్రయాణించింది ఓ బల్లి. బల్లి అంత దూరం ప్రయాణించడం సాధ్యమేనా అనే అనుమానం రావొచ్చు. మీ అనుమానం నిజమే... అది స్వతహాగా అంత దూరం ప్రయాణించలేదు. మరెలా అంటారా.. అయితే పూర్తి స్టోరీ చదివేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 03:45 PM IST
  • అమెరికా నుంచి ఇంగ్లాండ్‌కు ప్రయాణించిన బల్లి
  • ఓ ట్రావెలర్ సూట్‌కేసులో పడిపోవడంతో ఖండాంతరాలు దాటేసింది
  • ఆ బల్లిని ఆర్ఎస్‌పీసీఏ సంస్థకు అప్పగించిన ట్రావెల్
Lizard: 7వేల కి.మీ ప్రయాణించిన బల్లి... ఎలా సాధ్యమైందంటే...

Lizard travels over 7000 km : సాధారణంగా మనకు ఇళ్లల్లో, చెట్లపై కనిపించే బల్లులు (Lizard) మహా అయితే కొన్ని మీటర్ల దూరం తప్ప ఎక్కువ దూరం ప్రయాణించలేవు. కానీ ఓ బల్లి ఏకంగా 7250 కి.మీ దూరం ప్రయాణించింది. నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది నిజం. అయితే అది స్వతహాగా అంత దూరం వెళ్లలేదు. ఓ ట్రావెలర్ (Traveller) సూట్‌కేసులో పడిపోవడంతో.. అతనితో పాటే ఖండాంతరాలు దాటేసింది.

ఇంగ్లాండ్‌కి (England) చెందిన రాచెల్ బాండ్ ఇటీవలే అమెరికాలోని సన్నీ ఫ్లోరిడా (Florida) నుంచి తన హాలీ డే ట్రిప్ ముగించుకుని స్వదేశానికి వచ్చింది. ఓర్లాండోలోని తన ఇంటికి రాగానే వెంట తీసుకొచ్చిన లగేజీ మొత్తం అన్‌ప్యాక్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి బాండ్ గదిలోకి వచ్చిన ఆమె తల్లి... గది తలుపుపై ఆకుపచ్చ రంగులో ఉన్న బల్లిని గమనించింది. అది ఇంట్లోకి ఎలా దూరిందో మొదట ఆమెకు అర్థం కాలేదు. సాధారణంగా అటువంటి బల్లులు (Green anole lizard) అమెరికా, కరేబియన్ దీవుల్లో మాత్రమే ఎక్కువగా ఉంటాయి.

కాసేపటికి వారికి అర్థమైందేంటంటే... ఆ బల్లి (Lizard) రాచెల్ బాండ్ సూట్‌కేసులో పడిపోవడంతో అమెరికా నుంచి ఇంగ్లాండ్ వరకు వచ్చేసింది. నిజానికి, ఆ గది తలుపుపై బల్లి ఉందని తల్లి చెప్తే రాచెల్ మొదట నమ్మలేదు. ఆ తర్వాత నిజంగానే బల్లి ఉందని గ్రహించడంతో ఆర్ఎస్‌పీసీఏ (Royal Society for the Prevention of Cruelty to Animals) సంస్థకు సమాచారమిచ్చారు. ఆ సంస్థ ప్రతినిధులు రాచెల్ ఇంటికి చేరుకుని ఆ బల్లి తీసుకుని వెళ్లారు. ఒకవేళ ఆ బల్లిని గుర్తించకపోయి ఉంటే... నిద్ర లేచేసరికి అది తన ముఖంపై ఉండేదని... అలా జరగనుందుకు తన తల్లి రిలీఫ్‌గా ఫీలైందని రాచెల్ తెలిపారు. ఆర్ఎస్‌పీసీఏ ప్రతినిధులు మాట్లాడుతూ... ఆ బల్లి (Lizard) ఎలాంటి హానికి గురవకుండా ఇంత దూరం ప్రయాణించడం దాని అదృష్టమన్నారు. ఆ బల్లిని తిరిగి అమెరికా (America) పంపించే అవకాశం లేదని ఇంగ్లాండ్‌లోనే ఏదైనా జూ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. ఈ బల్లులతో ఎవరికి ఎలాంటి హానీ ఉండదన్నారు.

Also Read: Coronavirus: ఆ దేశంలో ఇటీవలే మొట్టమొదటి కరోనా కేసు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News