ఇండోనేషియాను మరో భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం ఇండోనేషియాలోని సుంబాదీవిలో దక్షిణ తీరాన భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 5.9గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలగమనం ప్రకారం 12:10 గంటలకు భూకంపం సంభవించినట్లు తెలిపింది. 750,000 మంది జనాభా కలిగిన సుంబా దీవికి 40 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.
వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రాణ, ఆస్తి నష్ట వివరాలపై ఇంకా సమాచారం అందలేదని తెలిసింది. అయితే ఈ భూకంపానికి సంభంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సుంబాదీవి ఇటీవల భూకంపం సంభవించిన సులవేసే దీవికి 1600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటీవలే సులవేసే దీవిలో సంభవించిన భూకంపం, సునామీతో 800 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. అతలాకుతలమైన పాలూ నగరంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
5.9-magnitude quake hits off Indonesian island of Sumba: USGS pic.twitter.com/vQZF1oH3jo
— ANI (@ANI) October 2, 2018