China Fire Accident: చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ (Anyang) నగరంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 36 మంది కార్మికులు చనిపోగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంతలో అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 200 మందికి పైగా ఉద్యోగులు మరియు దాదాపు 60 అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రాత్రి 11 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదానికి కారణమైన వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో..
భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల అవినీతి కారణంగా డ్రాగన్ కంట్రీలో పారిశ్రామిక ప్రమాదాలు తరుచూ జరుగుతూ ఉంటాయి . జూన్‌లో షాంఘైలోని రసాయన కర్మాగారంలో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. గత సంవత్సరం, సెంట్రల్ సిటీ షియాన్‌లో గ్యాస్ పేలుడు కారణంగా 25 మంది మృతి చెందారు. మార్చి 2019లో షాంఘైకి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాంచెంగ్‌లోని ఒక రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించి 78 మంది మరణించారు. నాలుగు సంవత్సరాల క్రితం ఉత్తర టియాంజిన్‌లోని రసాయన గిడ్డంగిలో ఒక భారీ పేలుడు సంభవించి.. 165 మంది మృత్యువాతపడ్డారు. ఇది చైనా యొక్క అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఒకటి.
Also Read: Pakistan: నీటి గుంతలో బోల్తాపడ్డ వ్యాన్... 12 మంది చిన్నారులతో సహా 20 మంది మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
China Fire Accident: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం... 36 మంది కార్మికులు దుర్మరణం..
చైనాలో ఘోర అగ్ని ప్రమాదం
అన్యాంగ్ నగరంలోని ఫ్యాక్టరీలో ఘటన
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.