కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి ఇప్పుడు మరో దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి పది మందిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) అన్ని దేశాలను హెచ్చరించింది. ప్రపంచంలోని మెజార్టీ ప్రజలకు కరోనా నుంచి ముప్పు తప్పదంటూ డబ్ల్యూహెచ్‌వో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రతి పది మందిలో ఒకరు కరోనా బారిన పడి, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని (WHO About Corona) తెలిపింది.
రాబోయే కాలంలో కోవిడ్19 కారణంగా మరిన్ని విపత్కర పరిస్థితులు తలెత్తనున్నాయని, నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలని సూచంచింది. డబ్ల్యూహెచ్‌ఓ కార్యనిర్వాహక సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో టాప్ ఎమర్జెన్సీ ఎక్స్‌పర్ట్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ.. ఆగ్నేయ ఆసియాతో పాటు కొన్ని ఐరోపా దేశాలు, తూర్పు మధ్యధరా ప్రాంతంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రాంతాలు, దేశాలు, పట్టణాలు, జాతులు, సమూహాలు అనే వ్యత్యాసం లేకుండా కరోనా వ్యాప్తి చెందుతుందని, కష్టకాలంలోకి వెళ్లబోతున్నామని మైక్ ర్యాన్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ఆగదని చెప్పారు. కరోనా వ్యాప్తికి మూల కేంద్రమైన చైనాలో దర్యాప్తు కోసం అంతర్జాతీయ మిషన్‌లో పాల్గొనే నిఫుణుల జాబితాను ఆమోదం కోసం చైనాకు డ్లబ్యూహెచ్‌ఓ పంపినట్లు వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
WHO: రాబోయేది మరింత కష్టకాలం!