Hero Vishal: అమరావతిలో సీఎం జగన్ ను హీరో విశాల్ కలవనున్నారు. అయితే రాజకీయం కాదు సినిమా కోసమే సమావేశమని విశాల్ తెలిపారు.
Hero Vishal Meet CM Jagan: హీరో విశాల్ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. సీఎం జగన్ కు బంధువైన విశాల్ వైసీపీలో చేరబోతున్నారని... కుప్పంలో టీడీపీ అభ్యర్థి చంద్రబాబుపై విశాల్ పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని విశాల్ చెబుతున్నా ఆయన పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం ఆగడం లేదు.