RRR WORKS START: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు పనులు మొదలయ్యాయి. నోటిఫికేషన్ రావడంతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోడ్డు 110 కిలోమీటర్ల పొడవున విస్తరించే అవకాశమున్నది. దీని కోసం 14 మండలాల్లో 78కుపైగా గ్రామాల్లో వేలాది ఎకరాల్లో భూసేకరణ జరగనుంది.