ITR Filing Deadline: ఐటీఆర్ డెడ్‌లైన్ నేటితో ముగియనుంది. రేపటి నుంచి నిబంధనలు మారనున్నాయి.
ITR Filing Deadline: ఐటీ రిటర్న్ దాఖలుకు ఇవాళే చివరి రోజు. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఐటీ రిటర్న్ ఫిల్లింగ్‌కు ఇవాళ్టితో గడువు ముగియనుంది. మరోసారి గడువు పెంచే పరిస్థితి కనిపించడం లేదు. రేపటి నుంచి ఐటీ రిటర్న్‌లను నమోదు చేసుకుంటే జరిమానాలు, ఆలస్య రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.