గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. నియోజకవర్గంలో అదనపు ఇన్ఛార్జిగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే ఉండగా మరొకరిని సమన్వయకర్తగా నియమించడం తనను అవమానించడమేనని శ్రీదేవి ఫైర్ అవుతున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్ద శుక్రవారం అర్ధరాత్రి అనుచరులతో కలిసి నిరసనకు దిగారు.