Aghori matha: శ్రీనివాస్ అఘోరాగా ఎలా మారాడు..?.. తల్లిదండ్రులు చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటో తెలుసా..?

Lady aghori in news: తెలంగాణలో కొన్ని రోజులుగా లేడీ నాగ సాధుమాత వైరల్ గా మారిన విషయం తెలిసిందే.  ఆమె ప్రస్తుతం అఘోరీ కాదని.. ట్రాన్స్ జెండర్ అంటూ కూడా వార్తలు వైరల్ గా మారాయి. 

Written by - Inamdar Paresh | Last Updated : Oct 22, 2024, 06:05 PM IST
  • కీలక వ్యాఖ్యలు చేసిన లేడీ అఘోరీ కుటుంబ సభ్యులు..
  • తమతో ఎవరు సరిగ్గా మాట్లతాడట్లేదని కామెంట్లు..
Aghori matha: శ్రీనివాస్  అఘోరాగా ఎలా మారాడు..?.. తల్లిదండ్రులు చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటో తెలుసా..?

Lady aghori matha shocking facts: తెలంగాణలో కొన్నిరోజులుగా అఘోరీ మాత హల్ చల్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాం ధ్వంసం తర్వాత అఘోరీ మాత ఆలయంకు వచ్చారు. అక్కడ ప్రత్యేకంగా పూజలు సైతం చేశారు. అప్పటి నుంచి తెలంగాణలో లేడీ అఘోరీ మాత అనేక మీడియా ఛానెల్స్ లకు ఇంటర్వ్యూలు  ఇస్తు హల్ చల్ చేశారు.  ఈ నేపథ్యంలోనే అఘోరీ మాత ఒకవైపు మన ధర్మం పాటిస్తునే, ఇతర ధర్మాలను కూడా గౌరవించాలన్నారు.

ఈ నేపథ్యంలో నాగ అఘోరీ పంచ భూతాలు తమ ఆధీనంలో ఉంటాయని, తమకు కూడా మహిళల మాదిరిగా పీరియడ్స్ వస్తాయని, ఆసమయంలో మాత్రం ఆలయాలకు దూరంగా ఉంటామన్నారు. ఇప్పటి వరకు వెయ్యికిపైగా శవాలను తిన్నట్లు కూడా అఘోరీ మాత చెప్పారు. అయితే.. అసలు ఆమె అఘోరీ కాదని,ట్రాన్స్ జెండర్ అని కూడా వార్తలు వైరల్ గా మారాయి. దీంతో అఘోరీ మాత ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై మండిపడ్డారు.

అంతే కాకుండా.. కొన్ని మీడియా వాళ్లు పనిగట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారని, ఇలాంటి పనులు చేస్తే మాత్రం.. వాళ్ల అంతు చూస్తానని కూడా చెప్పారు.  ఇదిలా ఉండగా ప్రస్తుతం అఘోరీ మాత ఎక్కడుంటారు.. అసలు ఆమె అఘోరీలా ఎలా మారారని నెటిజన్లు ఎక్కువగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తొంది.

పూర్తి వివరాలు..

అఘోరీ మాత స్వంతగ్రామం మంచిర్యాల జిల్లా మండలం కుశ్నపల్లిగా తెలుస్తొంది.అఘోరీగా మారక ముందు ఆయన పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీనివాస్ అని తెలుస్తొంది. అఘోర తండ్రి ఏల్లూరీ చిన్నయ్య,తల్లి చిన్నక్క. వీరికి మూడో సంతానంగా శ్రీనివాస్ జన్మించాడు. శ్రీనివాస్ కు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నట్లు తెలుస్తొంది. వేమనపల్లి ఎస్సీ హాస్టల్ లో ఆరవ తరగతి వరకు శ్రీనివాస్ చదువుకున్నట్లు సమాచారం.  

ఆరో తరగతి లోనే హాస్టల్ నుండి వెళ్లిపోయి శ్రీనివాస్ అఘోరాలా మారినట్లు సమాచారం.  పదహారు సంవత్సరాల తరువాత ఆరు నెలల క్రితం స్వంత ఇంటికి వచ్చి తల్లిదండ్రులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.  అమ్మవారి అవతారం లో వచ్చిన శ్రీనివాస్ ని చూసి కుటుంబ సభ్యులు షాక్ కు గురయినట్లు తెలుస్తొంది.

Read more: Lady Aghori: వాళ్ల అంతం చూస్తా..?.. శివతాండం చేసిన అఘోరీ మాత.. అసలేం జరిగిందంటే..?..

ఆరు నెలల క్రితం వచ్చి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు, అన్నదమ్ముల తో అప్పుడప్పుడు అఘోరీ ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. అఘోరీ వచ్చి వెళ్లిపోయాక గ్రామస్థులు తమని చూసి భయ పడుతున్నారని,  సరిగ్గా మాట్లాడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News