New Variant: చైనాలో కొత్త వేరియంట్ కలకలం.. షాంఘైలో లాక్ డౌన్

New Variant:  కొవిడ్ పుట్టినిల్లు చైనాలో మరో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో జులై 8న ఈ వేరియంట్‍ను గుర్తించినట్లు వెల్లడించారు. రెండు నెలల క్రితం షాంఘైలో కొవిడ్ కేసులు పెరిగడంతో లాక్ డౌన్ పెట్టారు. జూన్ మొదటి వారంలో ఎత్తేశారు. ఇంతలోనే కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో షాంఘైలో మళ్లీ కఠిన ఆంక్షలు విధించారు.

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 03:03 PM IST

Video ThumbnailPlay icon

Trending News