Telangana Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్..

Telangana Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల తుది జాబితాపై దాదాపు కసరత్తు పూర్తి చేశారు. అన్ని రకాల సర్వేలు పరిశీలించిన సీఎం కేసీఆర్.

  • Zee Media Bureau
  • Jun 30, 2023, 03:52 PM IST

Telangana Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల తుది జాబితాపై దాదాపు కసరత్తు పూర్తి చేశారు. అన్ని రకాల సర్వేలు పరిశీలించిన సీఎం కేసీఆర్. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు, కొన్ని సెగ్మెంట్లలో నేతల మధ్య విభేదాలు ఉన్నవారిని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సెగ్మెంట్లలో తమ బలాలు, విపక్షాల బలాల మీద నజర్ పెట్టారు. అలాంటి నేతలకు మరోసారి టికెట్లు ఇచ్చి చేతులు కాల్చుకొవద్దనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి పరవాలేదనిపించినా... గ్రేటర్ పరిధిలో మాత్రం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ నేతలు ఎవరనే దానిపై పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది.

Video ThumbnailPlay icon

Trending News