Ys Sharmila Son Engagement: రేపే వైఎస్ షర్మిల కుమారుని నిశ్చితార్ధం, వైఎస్ జగన్ హాజరౌతారా లేదా

Ys Sharmila Son Engagement: ఏపీలో ఇప్పుడు వైఎస్ షర్మిల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఏపీసీసీ పగ్గాలు దక్కడం మరోవైపు కుమారుడి పెళ్లి నిశ్చితార్దం ఆమెను మరోసారి వార్తల్లో నిలుపుతుున్నాయి. ఈ నిశ్చితార్ధానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరౌతారా లేదా అనేది ప్రాధాన్యతాంశంగా మారింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 17, 2024, 09:08 AM IST
Ys Sharmila Son Engagement: రేపే వైఎస్ షర్మిల కుమారుని నిశ్చితార్ధం, వైఎస్ జగన్ హాజరౌతారా లేదా

Ys Sharmila Son Engagement: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి నిశ్చితార్ధం రేపు అంటే జనవరి 18న హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. సోదరుడు వైఎస్ జగన్ సహా ప్రతిపక్షం, స్వపక్షం అందర్నీ ఆహ్వానించిన నేపధ్యంలో ఈ నిశ్చితార్ధం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎవరు హాజరౌతారు, ఎవరు కారనేది ఆసక్తిగా గమనిస్తున్నారు. 

వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి నిశ్చితార్ధం ఈ నెల 18వ తేదీన ఉంది. చాలాకాలంగా సోదరుడు జగన్‌తో దూరంగా ఉన్న వైఎస్ షర్మిల తన కుమారుడి పెళ్లి నిశ్చితార్ధం, పెళ్లికి స్వయంగా తాడేపల్లి వచ్చి ఆహ్వానించారు. ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా అందర్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఫిబ్రవరి 17వ తేదీన పెళ్లి జరగనుండగా రేపు జనవరి 18న నిశ్చితార్ధం ఉంది. గోల్కొండ రిసార్ట్స్‌లో జరగనున్న ఈ నిశ్చితార్ధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా కుటుంబసభ్యులంతా హాజరుకానున్నారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర నేతలు హాజరౌతారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ హాజరయే సమక్షంలో వైఎస్ జగన్‌తో కలిసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. 

నిశ్చితార్ధ ఆహ్వానాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని వైఎస్ షర్మిల ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అందుకే సీఎం జగన్‌తో పాటు ఇంకా ఎవరెవరు హాజరౌతారనేది ఆసక్తి రేపుతోంది. పిబ్రవరి 17న పెళ్లి జోధ్‌పూర్‌లోనూ రిసెప్షన్ హైదరాబాద్ శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్‌లో ఫిబ్రవరి 24న ఉంటుంది. వైఎస్ మరణానంతరం ఆ కుటుంబంలో జరుగుతున్న తొలి శుభకార్యం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also read: Dr BR Ambedkar Statue: ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News