Hyderabad Pub: పబ్ లో యువతి పై దాడి.. గ్యాంగ్ రేప్ చేస్తామని వార్నింగ్! హైదరాబాద్ లో మరో కిరాతకం..

Hyderabad Pub: హైదరాబాద్ పబ్ లు అరాచకాలకు అడ్డాగా మారాయా? డ్రగ్స్ మత్తులో యువత రెచ్చిపోతున్నారా? పోలీసుల కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతుందా? అంటే వరుసగా జరుగుతున్న ఘటనలతో హైదరాబాదీల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.

Written by - Srisailam | Last Updated : Jun 21, 2022, 12:46 PM IST
  • హైదరాబాద్ లో మరో దారుణం
  • స్టార్ హోటల్ పబ్ లో యువతిపై దాడి
  • గ్యాంగ్ రేప్ చేస్తామని వార్నింగ్
Hyderabad Pub: పబ్ లో యువతి పై దాడి.. గ్యాంగ్ రేప్ చేస్తామని వార్నింగ్! హైదరాబాద్ లో మరో కిరాతకం..

Hyderabad Pub: హైదరాబాద్ పబ్ లు అరాచకాలకు అడ్డాగా మారాయా? డ్రగ్స్ మత్తులో యువత రెచ్చిపోతున్నారా? పోలీసుల కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతుందా? అంటే వరుసగా జరుగుతున్న ఘటనలతో హైదరాబాదీల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అమ్నేషియా పబ్ కు వచ్చిన మైనర్ బాలిక్ ను ట్రాప్ చేసి కారులోనే గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. గ్యాంగ్ రేప్ కేసులో ప్రజాప్రతినిధుల పిల్లలే నిందితులుగా ఉండటంతో రాజకీయ రచ్చైంది. అమ్నేషియా పబ్ ఘటన మరవకముందే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. హైటెక్ సిటీలోని  స్టార్ హోట‌ల్ లో ఓ యువ‌తిపై యువ‌కులు దాడి చేశారు. అత్యాచారం చేస్తామని బెదిరింటారు.
ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.

యునైటెడ్ నేషన్స్ కోసం పని చేస్తున్నఓ యువ‌తి..  ఆదివారం సాయంత్రం ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీసీ కొహినూర్ ఓటినో బార్ లోని రూఫ్ టాప్ పబ్ లాంజ్ కు వెళ్ళింది. అయితే పబ్ లో ఉన్న 8మంది యువ‌కులు ఆ యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు. పబ్ లో ఉన్న సమయం లో బాధితురాలి దగరికి వచ్చి ఫోన్ నంబర్ అడిగారు నిందితులు. బాధితురాలు ఇవ్వను అని చెప్పడంతో పక్కకి తీసుకెళ్లారు అబ్రార్ , సాధ్ అనే యువకులు. పదే పదే యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. రేప్ చేస్తామని బెదిరించారు. అడ్డు వచ్చిన  బాధితురాలి స్నేహితురాలపై మద్యం సీసాలతో విచక్షణ రహితంగా దాడి చేశారుదాడి చేశారు. అడ్డుకోబోయిన పబ్ నిర్వహకులను బెదిరించారు.

ఆదివారం తెల్లవారుజామున పబ్ లో ఈ ఘటన జరిగింది. యువకుల దాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలు కావ‌డంతో.. ప‌బ్ నుంచి ఆమె నేరుగా హాస్పిటల్ కి వెళ్ళింది. చికిత్స తర్వాత హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పబ్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేసింది బాధితురాలు. నిందితులంతా బ‌డాబాబుల పిల్లలుగా గుర్తించిన‌ట్లు స‌మాచారం. పబ్ ల్లో వరుసుగా జరుగుతున్న ఘటనలతో హైదరాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. నిఘా లేకపోవడం వల్లే పబ్ లలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

Read also: Agniveer Notification 2022: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవిగో..  

Read also: Samantha: హీరోయిన్ తో చైతూ డేటింగ్.. ఆ పని చూడమని సమంత షాకింగ్ కామెంట్స్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News