Telangana: పోలీస్ వాహనంతో పరార్.. అంతలోనే ప్రమాదం

నలుగురు యువకులు బ‌హిరంగ ప్ర‌దేశంలో మ‌ద్యం తాగుతూ ( drinking alcohol in public) పోలీసులకు ప‌ట్టుబ‌డ్డారు. ఈ క్రమంలో మ‌త్తులో ఉన్న ఓ యువ‌కుడు ఏకంగా పోలీసుల (Telangana Police) వాహ‌నంతోనే పరారయ్యేందుకు ప్ర‌య‌త్నించాడు. కట్‌ చేస్తే.. చివరికి మరో వాహనాన్ని ఢికొట్టాడు.

Last Updated : Nov 13, 2020, 10:40 AM IST
Telangana: పోలీస్ వాహనంతో పరార్.. అంతలోనే ప్రమాదం

young man escape with police vehicle in Miryalaguda: హైదరాబాద్: నలుగురు యువకులు బ‌హిరంగ ప్ర‌దేశంలో మ‌ద్యం తాగుతూ ( drinking alcohol in public) పోలీసులకు ప‌ట్టుబ‌డ్డారు. ఈ క్రమంలో మ‌త్తులో ఉన్న ఓ యువ‌కుడు ఏకంగా పోలీసు (Telangana Police) వాహ‌నంతోనే పరారయ్యేందుకు ప్ర‌య‌త్నించాడు. కట్‌ చేస్తే.. చివరికి మరో వాహనాన్ని ఢికొట్టాడు. ఈ ఘటన గురువారం రాత్రి తెలంగాణ నల్లగొండ (Nalgonda) జిల్లాలోని మిర్యాలగూడలో చోటుచేసుకుంది. జిల్లాలోని మిర్యాలగూడ‌ పట్టణంలో సీఐ ర‌మేశ్ బాబు గురువారం రాత్రి త‌న బృందంతో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌ట్ట‌ణ శివార్ల‌లోని ఈదులగూడ సర్కిల్ బహిరంగ ప్రదేశంలో అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు మద్యం తాగుతూ కనిపించారు. Also read: Apsara Rani: అందచందాలతో పిచ్చెక్కిస్తున్న అప్సర..

దీంతో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రమేష్ బాబు (Miryalaguda CI) దిగి వారిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న యువకుడు.. పోలీసుల కళ్లు గప్పి సీఐ వాహనంతో కోదాడ వైపు పరారయ్యాడు. పరారవుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని సైతం ఢికొట్టాడు. యువకుడిని వెంబ‌డించిన పోలీసులు చివ‌ర‌కు ఆళ్ల‌గడప టోల్ గేటు వద్ద వాహానాన్ని ప‌ట్టుకున్నారు. అందులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యువకుడిని పోలీసుస్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?

Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

Trending News