Bathukamma Sarees: బతుకమ్మ చీరల పంపిణి తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పథకం. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ తెలంగాణ ప్రభుత్వం కానుకగా ఈ చీరలను అందిస్తోంది. 2017లో చీరల పంపిణీ కార్యక్రమం మొదలైంది. మరమగ్గ నేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు మహిళలకు విజయదశమికి ప్రభుత్వం అందించే చిరు కానుకగా బతుకమ్మ చీరలను చెబుతోంది అధికార పార్టీ. అయితే బతుకమ్మ చీరలపై కొందరు మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బతుకమ్మ చీరల పేరుతో నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు విపక్షాలు చేస్తున్నాయి.
దసరా పండుగ కోసం ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను కట్టుకోకుండా మహిళలు ఇతర పనుల కోసం వినియోగిస్తున్నారు. పంట పొలాల్లోకి అడవి పందులు రాకుండా చుట్టూ కంచెలా కొందరు బతుకమ్మ చీరలను కడుతున్నారు.మరికొందరు మూటలు కట్టేందుకు వినియోగిస్తున్నారు.మహబూబ్ నగర్ జిల్లా ధారూరు సంతలో అలాంటి సీనే కనిపించింది. ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల్లో ఆకు కూరలు మూట కట్టి తీసుకువచ్చింది మహిళా రైతు. ఇదేమని ప్రశ్నించగా బతుకమ్మ పాలిస్టర్ చీరలు కట్టుకునేలా లేవని చెప్పింది. గతంలో ఇచ్చిన చీరలను పొలం వద్ద బెదుర్లు పెట్టేందుకే వాడామని తెలిపింది.
మహబూబాబాద్ జిల్లా నెక్కొండలో బతుకమ్మ చీరలు ఇస్తే ప్లాస్టిక్ టబ్బులు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చిన ఘటనలు వెలుగుచూశాయి. ప్లాస్టిక్ టబ్బులు అమ్ముకునే మహిళ వీధుల్లో తిరుగుతూ బతుకమ్మ చీరలు కొంటాం.. బతుకమ్మ చీరలు ఇస్తే ప్లాస్టిక్ టబ్బులు ఇస్తామని చెబుతూ వెళ్లింది. ఆరు బతుకమ్మ చీరలకు ఓ టబ్బు.. నాలుగు చీరలకు ఓ బక్కెట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. దీంతో బతుకమ్మ చీరలు ఇచ్చి ప్లాస్టిక్ టబ్బులు తీసుకునేందుకు మహిళలు ఎగబడ్డారు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ కొందరు మహిళలు వాటిన తగలబెట్టిన వీడియోలు బయటికి వచ్చాయి.
Read also: CM KCR SALUTE HARISH RAO: హరీశ్ రావుకి సీఎం కేసీఆర్ సెల్యూట్.. ఎందుకో తెలుసా?
Read also: Munugode Bypoll: అక్టోబర్ 7న మునుగోడు బైపోల్ నోటిఫికేషన్? బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి మెసేజ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి