Wife cuts off Husband genitals : వివాహేతర సంబంధాలు, భార్యపై అనుమానాలతో నిత్యం హత్య, ఆత్మహత్యల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో నివసించే ఓ దంపతుల మధ్య గత కొద్ది రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త తరచూ తాగి వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహించిన భార్య తన భర్త మర్మాంగాలు కోసి హత్య చేసింది.
వివరాల్లోకి వెళ్తే కొల్హాపూర్ జిల్లా శాహువాడీ డివిజన్ మాంగుర్వాడిలో ఇరువురు దంపతులు సొంత గ్రామం లోలడి నుంచి వచ్చి నివసిస్తున్నారు. భర్త ప్రకాశ్ పాండు రంగ్ కాంబ్లేతో కలిసి అక్కడే ఓ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తోంది భార్య వందన. కొన్నాళ్ల క్రితం వరకు బానే ఉన్నారు. కానీ ఇటీవల భర్తకు అనుమానం పెరిగి తరచూ తాగొచ్చి భార్యను వేధించసాగాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి భర్త ప్రకాశ్‌ను భార్య వందన కిరాతకంగా హత్య చేసింది. తలమీద రాయితో మోది.. కోపంతో అతని మర్మాంగాన్ని కత్తితో కోసేసింది. భర్తను చంపిన వందన ఆమె కూడా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినట్లు నటించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Red - lady rams into Balakrhna house : బాలకృష్ణ ఇంటి గేటును ఢీకొట్టిన యువతి
Also Read - lady rams into Balakrhna house : బాలకృష్ణ ఇంటి గేటును ఢీకొట్టిన యువతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook