Weather Report: వడదెబ్బ నివారణకు ఈ చిట్కాటు పాటించండి..NCDC మార్గదర్శకాలు..

Weather Report: దేశ వ్యాప్తంగా ఎన్నడు లేనంతగా ఉష్ణోగ్రతలు గత రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఎండ వేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో NCDC పలు మార్గదర్శకాలను సూచించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 6, 2024, 12:37 PM IST
Weather Report: వడదెబ్బ నివారణకు ఈ చిట్కాటు పాటించండి..NCDC మార్గదర్శకాలు..

Weather Report: దేశ వ్యాప్తంగా సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రజలు తమ అవసరాలకై బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.ఇక ఆరు బయట ఎండల్లో పనిచేసే కార్మికులకు అవసరమైన వైద్య సేవలు అందించేందకు ఈఎస్ఐ హాస్పిటల్స్‌కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(NCDC) మార్గదర్శకాలు సూచించింది. వడదెబ్బ బాధితులుకు సత్వర చికిత్సలు అందించాలని పేర్కొంది. మార్చి 1 నుంచి ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో నమోదైన వడదెబ్బ కేసులు, చికిత్సలు, చనిపోయిన వారి వివరాలను నేషనల్ ప్రోగ్రామ్‌ ఆన్ క్లైమేట్ ఛేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ పోర్టల్‌లో నమోదు చేయాలని కోరింది.
ముఖ్యంగా వృద్దుల్లో అయోమయం, ఆందోళన, చికాకు, మూర్చ, కోమా లక్షణాలు.. శరీరం వేడిగా.. చర్మం ఎర్రగా.. తేమ లేకుండా మారడం.. బాడీ టెంపరేచర్ 104 ఫారన్‌ హీట్‌కు మించి నమోదు కావడం.. తలనొప్పి, ఆందోళన, కండరాల బలహీనత, తిమ్మిరి, వికారం, వాంతులు గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

అటు చిన్న పిల్లలు సరిగా తినకపోవడం.. చికాకు, మూత్ర విసర్ణన సరిగా కాకపోవడం.. బద్ధకం, నోరు పొడిబారడం, వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తమై డాక్టర్లను సంప్రదించాలి.

మొత్తంగా గవర్నమెంట్, డిస్పెన్సరీతో పాటు ఈఎస్ఐ హాస్పిటల్స్‌కు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలి.

ఆసుపత్రిలో వేడిని తగ్గించే చర్యలు చేపట్టాలి. పై కప్పు గ్రీన్ రూఫ్, కూలింగ్ రూఫ్, విండో షేడ్ ఏర్పాలు చేసుకోవాలి.

పేషెంట్స్ వెయిటింగ్ చేసే ప్రాంతాలు.. చికిత్స చేసే ప్రాంతాలు చల్లగా ఉండేలా పరికరాలు ఎల్లపుడు పనిచేస్తూ ఉండాలి.

వడదెబ్బకు గురైన వ్యక్తులను అవసరమైన చికిత్స అందించాలి. ఐవీ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్స్, అవసరమైన ఇతర పరికరాలు.. అందుబాటులో ఉంచాలి.

అన్ని హాస్పిటల్స్‌లో తాగునీరు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

వడదెబ్బకు గురైన వ్యక్తులను ప్రాథమిక చికిత్స అందించాలి.

హాస్పిటల్స్‌కు తరలించే అంబులెన్స్‌లో ఐస్ ప్యాక్స్, చల్లటి నీరు ఉండేలా చూసుకోవాలి. వాతావరణం విభాగం సూచనలు పాటిస్తూ వడగాల్పుల సమయంలో బయట ప్రదేశాల్లో ఎలాంటి సమావేశాలు, వేడుకలు నిర్వహించకూడదు.

ఉద్యోగులు, కార్మికులకు పని ప్రదేశాల్లో చల్లటి తాగు నీటి వసతి అందేలా చూడాలి.

ఉద్యోగులు.. ఏసీలో పనిచేస్తోన్న ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఒక కప్పు నీటిని సేవిస్తూ ఉండాలి.

తీవ్రమైన ఎండలో పనిచేసే వారు గంటకు ఓ ఐదు నిమిషాలు రిలాక్స్ అవ్వాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే చల్లటి ప్రదేశాలకు వెళ్లాలి.

Also read: Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News