Drunk Men Created Ruckus: వైన్ షాప్ ముందే మందు బాబుల వీరంగం.. నడిరోడ్డుపై ఫైటింగ్ సీన్

Drunk Men Created Ruckus: హైదరాబాద్‌లోని పార్సిగుట్టలో ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన పలువురు మందుబాబులు నడిరోడ్డుపైనే రెచ్చిపోయారు. ప్రధాన రహదారిపై చుట్టూ అందరూ చూస్తున్నారనే స్పృహ కూడా లేకుండా విచక్షణ మరిచి ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 12:27 AM IST
  • వైన్ షాప్ వద్దే నడిరోడ్డుపై బాహాబాహికి దిగిన మందు బాబులు
  • విచక్షణ లేకుండా రోడ్డుపైనే కొట్టుకున్న వైనం
  • అర్ధగంటపాటు వాహనాలు నిలిచిపోయాయని స్థానికుల ఆగ్రహం
Drunk Men Created Ruckus: వైన్ షాప్ ముందే మందు బాబుల వీరంగం.. నడిరోడ్డుపై ఫైటింగ్ సీన్

Drunk Men Created Ruckus On Road: హైదరాబాద్‌లోని పార్సిగుట్టలో ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన పలువురు మందుబాబులు నడిరోడ్డుపైనే రెచ్చిపోయారు. ప్రధాన రహదారిపై చుట్టూ అందరూ చూస్తున్నారనే స్పృహ కూడా లేకుండా విచక్షణ మరిచి ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగారు. దాదాపు అరగంటకుపైగానే జరిగిన ఈ మూకుమ్మడి దాడిలో పలువురికి గాయాలయ్యాయి. అయినప్పటికీ మందు బాబులు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా మరింత రెచ్చిపోయి మరీ దాడులు చేసుకున్నారు. పార్సిగుట్ట నుండి పద్మారావు నగర్ వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వైన్ షాప్ వద్దే నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో అదే మార్గంగుండా వచ్చి, వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విచిత్రం ఏంటంటే.. దాదాపు అర్ధగంటకుపైగానే ఈ ముష్టియుద్ధం జరిగినప్పటికీ.. చిలకలగూడ పోలీసులు అప్పటివరకు అక్కడికి చేరుకోకపోవడం ఈ ఘటనను చూసే వారికి ఆశ్చర్యానికి గురిచేసింది. 

పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు వీలైనంత త్వరగా వచ్చి మందుబాబులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తారేమోనని ఎదురుచూసినప్పటికీ.. ఆ చుట్టుపక్కల అలాంటి పరిస్థితే కనిపించలేదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read : SBI Loans For LIC IPO: ఎస్‌బీఐ బంపరాఫర్.. ఎల్ఐసి ఐపివోలో షేర్స్ కొనడానికి రుణాలు

Also read : Rape Allegations: రాజస్థాన్ మంత్రి కుమారునిపై అత్యాచార ఆరోపణలు, జీరో ఎఫ్ఐఆర్ నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News