మా ఊరికి రావద్దు..!!

చైనాలో మొదలైన 'కరోనా వైరస్' ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది.  ఇప్పటి  వరకు జనం చేతులు శుభ్రంగా కడుక్కున్నారు. ఇంకా కడుక్కుంటూనే ఉన్నారు.  సామూహిక జీవనానికి దూరంగా ఉంటున్నారు. రైళ్లు, బస్సులు, విమానాలు, పార్టీలు, దుకాణాలు, థియేటర్లు, స్కూళ్లు.. ఇలా అన్నీ బంద్ చేసే పరిస్థితి దాపురించింది.

Last Updated : Mar 24, 2020, 11:07 AM IST
మా ఊరికి రావద్దు..!!

చైనాలో మొదలైన 'కరోనా వైరస్' ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది.  ఇప్పటి  వరకు జనం చేతులు శుభ్రంగా కడుక్కున్నారు. ఇంకా కడుక్కుంటూనే ఉన్నారు.  సామూహిక జీవనానికి దూరంగా ఉంటున్నారు. రైళ్లు, బస్సులు, విమానాలు, పార్టీలు, దుకాణాలు, థియేటర్లు, స్కూళ్లు.. ఇలా అన్నీ బంద్ చేసే పరిస్థితి దాపురించింది. 

ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటి వరకు పట్టణాలకే  పరిమితమైన 'కరోనా వైరస్' ప్రభావం .. ఇప్పుడు గ్రామాలను కూడా తాకింది. తెలంగాణ పల్లెలు 'కరోనా వైరస్' పేరు వింటేనే గజగజా వణుకుతున్నాయి. పల్లెల్లో కొత్తగా ఎవరు కనిపించినా .. ప్రజలు అనుమానించే పరిస్థితులు వచ్చాయి.  ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారని ఆరా తీస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఈ క్రమంలో పల్లెల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అంతే కాదు గ్రామ సరిహద్దులను మూసివేస్తున్నారు. 

సాయానికి 'సై' అంటున్న హీరో నితిన్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్, పెద్ద షాపూర్ తండాలో లాక్ డౌన్  పకడ్బందీగా అమలవుతోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న గ్రామ సర్పంచులు  ముళ్ల కంచెలు, కట్టెలు వేసి గ్రామ సరిహద్దుల్లో ఉన్న రోడ్లను మూసివేశారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప గ్రామం నుంచి ఎవరైనా బయటకు వెళ్లాలి.  అంతే కాదు గ్రామానికి చెందిన వారు మాత్రమే లోనికి రావాలనే నిబంధన విధించారు. గ్రామ సరిహద్దుల వద్ద ఎవరూ రాకుండా కాపలా ఉంటున్నారు. కరోనా వైరస్ నివారణకే ఈ కఠిన నిబంధన విధించామని చెబుతున్నారు.  

తెలంగాణ గ్రామాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తడం వింతగా అనిపిస్తోంది. ఇంకా ముందు ముందు ఎలాంటి పరిణామాలు కనిపిస్తాయో వేచి చూడాలి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News