Vikarabad: వికారాబాద్ గురుకుల స్కూల్లో 120 మంది విద్యార్థులకు అస్వస్థత.. కలుషిత నీరే కారణం..!

Vikarabad Tribal Welfare Gurukula School: వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల గురుకుల స్కూల్లో 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 31, 2022, 01:12 PM IST
  • వికారాబాద్ గురుకుల స్కూల్లో కలుషిత నీరు
  • 120 మంది విద్యార్థులకు అస్వస్థత
  • టైఫాయిడ్, జ్వరం, జలుబు, చర్మ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులు
Vikarabad: వికారాబాద్ గురుకుల స్కూల్లో 120 మంది విద్యార్థులకు అస్వస్థత.. కలుషిత నీరే కారణం..!

Vikarabad Tribal Welfare Gurukula School: వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్లో 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇక్కడి గురుకులంలో మొత్తం 600 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో 2 రోజులుగా ఇక్కడే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. కొందరు విద్యార్థులు మెడికల్ క్యాంపులో టెస్టులు చేయించుకుంటుండగా మరికొందరు విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు.

కుల్కచర్ల ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్లో కొద్దిరోజులుగా మంచినీటి సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి సమీపంలోని చెరువులో బోరు బావి ఉంది. ఆ బోరు బావి నీటినే గురుకులంలో తాగునీటి అవసరాలకు వాడుతున్నారు. అయితే ఇటీవలి వర్షాల కారణంగా బోరు బావి నీటమునిగిపోయింది. దీంతో ఆ నీరు కలుషితం కాగా.. ఆ నీటినే గురుకులంలో వాడుతున్నారు. ఆ నీటిని తాగడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. 

గురుకులంలో కొంతమంది విద్యార్థులు టైఫాయిడ్ బారినపడగా..మరికొందరు జ్వరం, దగ్గు, చర్మ వ్యాధుల బారినపడినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా నీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Also Read: నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా.. ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటా: మహేష్ బాబు

Also Read: Ganesh Chaturthi 2022: బొజ్జ గణపయ్యకు అత్యంత ఇష్టమైన 5 పదార్థాలివే.. ఇవి నైవేద్యంగా పెడితే గణనాథుడి అనుగ్రహం తప్పక పొందుతారు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News