Only one curry and one sweet in Wedding: రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla) వేములవాడ పట్టణానికి చెందిన ముస్లిం మత పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ముస్లింల వివాహ వేడుకల్లో కేవలం ఒకే కూర, ఒకే స్వీటును వడ్డించాలని నిర్ణయించారు. ఈ మేరకు మత పెద్దలు తీర్మానం చేశారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ తీర్మానం అమలులోకి రానుంది. వేములవాడ ముస్లిం మత పెద్దలు చేసిన ఈ తీర్మానం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
పెళ్లిళ్లలో విందు భోజనాలకు అయ్యే ఖర్చుపై ఇటీవలి కాలంలో ముస్లిం మత పెద్దలకు చాలానే ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పేద ముస్లిం కుటుంబాలు ఆ ఖర్చును భరించలేకపోతున్నామని మత పెద్దల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని షాదీఖానాలో ఇటీవల 8 మజీద్ కమిటీలు సమావేశమై దీనిపై చర్చించాయి. వివాహ వేడుకల్లో విందు ఖర్చును నియంత్రించాల్సిందేనని మత పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. విందుల్లో బగారా రైస్‌తో పాటు చికెన్ లేదా మటన్ కర్రీ, ఏదైనా ఒక స్వీటును వడ్డించాలని తీర్మానించారు.
సాధారణంగా ముస్లిం కుటుంబాల్లో వివాహాలకు చికెన్, మటన్ బిర్యానీలు, కబాబ్స్, తందూరీ రోటి, చపాతీ, కుర్బానీ కా మీఠా, ఖద్దూ కా కీర్, షేమియా, షీర్ కుర్మా, ఐస్ క్రీమ్ తదితర వంటకాలు వడ్డిస్తారు. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో (Covid 19 cases in India) చాలా ముస్లిం కుటుంబాలు ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. వివాహ వేడుకల్లో పదుల సంఖ్యలో వెరైటీలతో భోజనాలు పెట్టడం వారికి తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే వేములవాడ ముస్లిం మత పెద్దలకు వివాహ ఖర్చుపై సామాన్య ముస్లిం కుటుంబాల నుంచి ఫిర్యాదులు అందడంతో ఖర్చును నియంత్రించేలా నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Lions Infected Covid 19: మనుషుల నుంచి సింహాలకు కరోనా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook