Amit Shah: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన అమిత్ షా.. రాష్ట్రంలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని పిలుపు

Jana Garjana Sabha In Adilabad: ఆదిలాబాద్ జన గర్జన సభలో సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు అమిత్ షా. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు పేదల గురించి మాట్లాడుతారని.. కానీ పేదల కోసం ఏం చేయరని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 10, 2023, 06:15 PM IST
Amit Shah: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన అమిత్ షా.. రాష్ట్రంలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని పిలుపు

Jana Garjana Sabha In Adilabad: తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిందని.. కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జనగర్జన సభలో పాల్గొన్న అమిత్ షా.. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. పదేళ్లుగా కేసీఆర్‌ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదని.. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదని విమర్శించారు. కేటీఆర్‌ను సీఎం చేయడం గురించే కేసీఆర్‌ ఆలోచించారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వస్తోందని జోస్యం చెప్పారు. డిసెంబర్‌3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలన్నారు.
 
రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు అమిత్ షా. పవిత్ర భూమి అయినటువంటి ఆదిలాబాద్‌కు వచ్చానని.. కుమురం భీమ్‌ పేరు చెబితేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారని.. కానీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలకు కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి.. ఇచ్చారా..? అని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిరం కట్టాలా.. వద్దా.. చెప్పండి..? అని అడిగారు.

ఎన్నో అడ్డంకులను అధిగమించి మోదీ ప్రభుత్వం రామమందిరం నిర్మిస్తోందని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 ఎత్తివేసి కశ్మీర్‌కు మోదీ సర్కారు విముక్తి కల్పించిందని.. సర్జికల్‌ స్ట్రయిక్స్ నిర్వహించి శత్రువులను తరిమి కొట్టిందన్నారు. ప్రతి పేద మహిళకు మోదీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చారని అన్నారు. రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు జమ చేస్తున్నామని.. దళితులు, గిరిజనుల కోసం ప్రధాని తొమ్మిదేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై కూడా ఫైర్ అయ్యారు అమిత్ షా. ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌ వాళ్లు కొత్త బట్టలు వేసుకుని వస్తారని.. పేదల గురించి మాట్లాడుతారని గానీ.. ఏం చేయరని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదని.. తొమ్మిదేళ్లుగా నరేంద్ర మోదీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ చేశానని కేసీఆర్‌ చెబుతుంటారని.. రైతుల ఆత్మహత్యల విషయంలో నెంబర్‌వన్‌ చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఎన్నికల గుర్తు కారు అని.. కానీ ఆ కారు స్టీరింగ్‌ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుందని సెటైర్లు వేశారు. ఎంఐఎం దగ్గర స్టీరింగ్‌ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమా..? అని అన్నారు. బీజేపీని గెలిపించాలని కోరారు.

Also Read: Assembly Elections 2023: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? రూల్స్ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇవే..   

Also Read: Chandrabau Case: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంలో విచారణ శుక్రవారానికి వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News