TRS VS BJP: రూ 6700 కోట్లు కట్టాల్సిందే.. కేసీఆర్ సర్కార్ కు నెలరోజుల డెడ్ లైన్!

TRS VS BJP: కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య కొన్ని రోజులుగా వార్ సాగుతోంది. నరేంద్ర మోడీ సర్కార్ నిధుల విడుదల, ప్రాజెక్టుల మంజూరులో తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ సర్కార్ ఆరోపిస్తుండగా.. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ కేసీఆర్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ పెద్దలు ఆరోపిస్తున్నారు

Written by - Srisailam | Last Updated : Aug 30, 2022, 08:55 AM IST
  • తెలంగాణకు కేంద్రం షాక్
  • కరెంట్ బకాయిలు చెల్లించాలని ఆర్డర్
  • కేసీఆర్ సర్కార్ నెలరోజుల డెడ్ లైన్
 TRS VS BJP: రూ 6700 కోట్లు కట్టాల్సిందే.. కేసీఆర్ సర్కార్ కు నెలరోజుల డెడ్ లైన్!

TRS VS BJP:  కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య కొన్ని రోజులుగా వార్ సాగుతోంది. నరేంద్ర మోడీ సర్కార్ నిధుల విడుదల, ప్రాజెక్టుల మంజూరులో తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ సర్కార్ ఆరోపిస్తుండగా.. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ కేసీఆర్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ పెద్దలు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్న కేంద్ర బృందాలు.. ఎక్కడ వీలుంటే అక్కడ కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి షాకిచ్చింది కేంద్రం. ఏపీ విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉన్న 6 వేల 756 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. బకాయిల చెల్లింపనకు తెలంగాణకు నెల రోజుల డెడ్ లైన్ విధించింది.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కరెంట్ కొరత ఉండేది. దీంతో విభజన చట్టం మేరకు 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్‌కో 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది.ఇందుకు సంబంధించి తెలంగాణ డిస్కమ్‌లు ఏపీ డిస్కమ్ లకు రూ.3,441.78 కోట్లు చెల్లించాలి. కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో  ఈ ఏడాది జూలై 31 నాటికి రూ.3,315.14 కోట్ల లేట్‌ సర్‌ చార్జీ పడింది. మొత్తం రూ.6,756.92 కోట్లు ఏపీకి తెలంగాణ బకాయి పడింది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం చాలా సార్లు ఏపీని కోరింది.కాని తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు.

గత ఏడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్‌ శాఖ నిర్వహించిన ఇంధన శాఖ కార్యదర్శుల సమావేశంలోనూ ఏపీ అధికారులు కరెంట్ బిల్లుల విషయాన్ని ప్రస్తావించారు. ఇరు రాష్ట్రాలు చర్చించుకుని 15 రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని కేంద్రం సూచించింది. గడువులోగా తేల్చుకోకుంటే తాము కేంద్ర హోంశాఖతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. ఏపీనే తమకు బకాయిలు చెల్లించాలని వాదిస్తోంది తెలంగాణ సర్కార్. దీంతో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీనీ కలిసిన ఏపీ సీఎం జగన్.. విద్యుత్ బిల్లుల సమస్యను పరిష్కరించేలా చూడాలని అభ్యర్థించారు. జగన్ ప్రధానితో సమావేశమైన కొన్ని రోజులకే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏపీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. తమ పెండింగ్ అంశాలను ఏపీ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో విద్యుత్ బకాయిల అంశం కూడా ఉంది. దీంతో తాజాగా ఏపీకి చెల్లించాల్సిన కరెంట్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా ఏపీకి చెల్లింపులు చేయాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అనూప్ సింగ్ బిష్ట్ తెలంగాణ సీఎస్‌కు సూచించారు.

అయితే కేంద్ర సర్కార్ ఆదేశాలపై మండిపడుతోంది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంపై మోడీ సర్కార్  కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఏపీ నుంచి తెలంగాణకు 12 వేల 900 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. విద్యుత్‌తో PPAల్లో తెలంగాణకు నష్టం జరిగిందన్నారు. విద్యుత్ రంగంలో కేసీఆర్‌ సాధించిన విజయాలను  జీర్ణించుకోలేకే బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సాగుకు నిరంతరం కరెంట్ సరఫరాను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూకుడు..31న బీహార్‌కు గులాబీ నేత..!

Also read:Viral Video: జనవరికి సరికొత్త స్పెల్లింగ్ చెప్పిన టీచర్, విద్యార్థులు..వీడియో వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News