కేసీఆర్ కు ఊహించని షాక్ ; సొంత ఇలాఖాలో కాంగ్రెస్ జెండా

                                                       

Last Updated : Oct 4, 2018, 06:04 PM IST
కేసీఆర్ కు ఊహించని షాక్ ; సొంత ఇలాఖాలో కాంగ్రెస్ జెండా

తెలంగాణ సీఎం కేసీఆర్ కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ లో పార్టీకి ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ కు చెందిన నేతలు గుంపగుత్తగా పార్టీకి గుడ్ బై చెప్పి.. హస్తం కండువా కప్పుకున్నారు. ప్రముఖ మీడియ కథనం ప్రకారం.. జగదేవ్ పూర్ ఎంపీపీ రేణుకతో పాటు, ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్ లు, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ఫాం హౌస్ జగదేవ్ పూర్ పరిధిలోనే ఉండటం గమనార్హం.

ఇది దేనికి సంకేతం

రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువైన జగదేవ్ పూర్ నుంచి టీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇదే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజా పరిస్థితి సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిగణించనుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

కేసీఆర్ పతనం షురూ - ఉత్తమ్

తాజా పరిణామంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పై తెలంగాణలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో గజ్వేల్ పరిస్థితే అందుకు నిదర్శమన్నారు. ఒక్క గజ్వేలు లోనే కాదు..తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని ఉత్తమ్ జోస్యం చెప్పారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం  గజ్వేల్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, మహాకూటమి జెండా ఎగరడం ఖాయమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Trending News