Cheating case: రైల్వే ఉద్యోగాల పేరుతో మోసాలు.. అరెస్ట్

హైదరాబాద్: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఇతరుల నుంచి డబ్బు వసూలు చేసి మోసాలకు ( Cheating ) పాల్పడుతోన్న ఇద్దరు యువకులను ఇవాళ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Last Updated : Jul 13, 2020, 10:24 PM IST
Cheating case: రైల్వే ఉద్యోగాల పేరుతో మోసాలు.. అరెస్ట్

హైదరాబాద్: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఇతరుల నుంచి డబ్బు వసూలు చేసి మోసాలకు ( Cheating ) పాల్పడుతోన్న ఇద్దరు యువకులను ఇవాళ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తోన్న నరేష్‌ తన స్నేహితుడు గిరిబాబుతో కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్‌లోని జిల్లెలగూడకు చెందిన మహిళ బ్యూటీషియన్‌తోపాటు ఆమె సోదరుడికి కూడా ఇదే తరహాలో రైల్వే ఉద్యోగాలు ( Railway jobs ) ఇప్పిస్తామని నమ్మబలికి వారి నుంచి 25 లక్షల రూపాయలు కాజేశారు. 

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 4 లక్షల రూపాయలను రికవరీ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వసూళ్లకు పాల్పడే వారిని నమ్మి మోసపోవద్దని పోలీసులు పదేపదే చెబుతున్నా.. కేటుగాళ్ల చేతుల్లో మోసపోతున్న వారి సంఖ్యకు మాత్రం కొదువ లేకుండా పోతోందని ఈ తరహా ఘటనలు అప్పుడప్పుడూ నిరూపిస్తూనే ఉన్నాయి.

Trending News