Two months old boy died in Jubilee Hills Car Accident: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వేగంగా దూసుకొచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండున్నర నెలల పసికందు అక్కడిక్కడే మృతి చెందగా.. ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గురువారం రాత్రి 8 గంటల సమయంలో టీఆర్ నంబర్ ఉన్న మహేంద్ర థార్ కారు మాదాపూర్ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోకి వచ్చింది. రోడ్ నంబర్ 1/45 కూడలిలో అతివేగంగా రావడంతో అదుపుతప్పి.. అక్కడే బుడగలు విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహన్, సారిక చౌహన్, సుష్మ బొంస్లేలను ఢీ కొట్టింది. కాజల్ చేతిలో ఉన్న రెండున్నర నెలల పసికందు, సారిక చేతిలో ఉన్న ఏడాది వయసున్న బాలుడు కిందపడిపోయారు.
రోడ్డుపై పడడంతో రెండున్నర నెలల పసికందు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది చుసిన కారు నడుపుతున్న వ్యక్తి పరారు అయ్యాడు. గాయపడ్డవారిని స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు అస్పత్రికి తరలించగా.. రెండున్నర నెలల బాబు మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు.
కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ప్రమాద విషయం తన దృష్టికి వచ్చిందని.. ఆ కారుకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రస్తుతం తాను దుబాయ్‌లో ఉన్నానని, తాను మీర్జా అనే ఫ్రెండ్‌కు స్టిక్కర్ ఇచ్చానని, అది అతనికి సంబంధించిన కారు కావొచ్చు అని బోధన్ ఎమ్మెల్యే చెప్పారు. ఇది ప్రమాదమా, నిర్లక్ష్యం వలన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజం తెలస్తుందన్నారు.
Also Read: Today Horoscope March 18 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు చేయని పొరపాటుకు శిక్ష అనుభవిస్తారు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook