TSRTC T-24 Tticket Price Cut: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌.. రూ. 90తో నగరమంతా చక్కర్లు కొట్టొచ్చు!

TSRTC T24 Ticket Latest Price is RS 90. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రయాణించే వారికి కాస్త ఆర్థిక భారంను తగ్గించింది. సాధారణ ప్రయాణికులకు టీ-24 టికెట్‌ ధర రూ. 100 ఉండగా.. దాన్ని రూ. 90కి తగ్గించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 26, 2023, 09:19 PM IST
TSRTC T-24 Tticket Price Cut: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌.. రూ. 90తో నగరమంతా చక్కర్లు కొట్టొచ్చు!

TSRTC T24 Ticket Latest Price is RS 90: వేసవి నేపథ్యంలో నగర ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రయాణించే వారికి కాస్త ఆర్థిక భారంను తగ్గించింది. సాధారణ ప్రయాణికులకు టీ-24 టికెట్‌ ధర రూ. 100 ఉండగా.. దాన్ని రూ. 90కి తగ్గించింది. ఇదే టీ-24 టికెట్‌ను సీనియర్‌ సిటిజన్లకు రూ. 80కే అందించనుంది. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్‌ సిటిజన్లు వయసు ధ్రువీకరణ కోసం తమ ఆధార్‌ కార్డును బస్‌ కండక్టర్లకు చూపిస్తే సరిపోతుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టీ-24 టికెట్‌ ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి.

హైదరాబాద్‌ నగరంలో ఎక్కువగా ప్రయాణించే వారికోసం టీఎస్‌ఆర్టీసీ గత నెలలో టీ-24 టికెట్‌ను తీసుకొచ్చింది. టీ-24 టికెట్‌ కొనుగోలు చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించవచ్చు. నగరమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఈ  టీ-24 టికెట్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రతి రోజు సగటున 25వేల వరకు టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద టీ-24 టికెట్‌ అందుబాటులో ఉంటుంది. 

టీ-24 టికెట్‌తో పాటు మహిళలు, సీనియర్‌ సిటిజన్ల టీ-6 టికెట్‌ను ఇటీవల ప్రారంభించారు. రూ. 50తో ఈ టికెట్‌ కొనుగోలు చేస్తే.. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రయాణించవచ్చు. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఎఫ్‌-24 టికెట్‌ను కూడా టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. రూ. 300 చెల్లించి ఈ టికెట్‌ కొనుగోలు చేస్తే.. 24 గంటల పాటు నలుగురు నగరం అంతటా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో టీ-24, టీ-6, ఎఫ్‌-24 టికెట్లు అందరికీ ఉపయోగపడనున్నాయి. 

Also Read: Hyundai Creta Price 2023: కేవలం రూ. 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!  

Also Read: Mamukkoya Died: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News