TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అన్ని డీఏలు మంజూరు

VC Sajjanar on TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలు మంజూరు చేస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనర్‌ తెలిపారు. అక్టోబర్ నెల జీతంతో కలిపి అందుకోనున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 4, 2023, 06:24 PM IST
TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అన్ని డీఏలు మంజూరు

VC Sajjanar on TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ వచ్చింది. తమ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనర్‌ తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్‌ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. 

"టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది." అని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనర్‌ తెలిపారు. 

Trending News