/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

TSRTC DA Arrears: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ వచ్చింది. మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. గతేడాది జూలై నెలలో ఇవ్వాలనిన 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగుల ఖాతాలో సంస్థ జమ చేస్తుందని ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారని వారు అన్నారు. 2011లో జరిగిన ఉద్యమంలో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యోగులు పోరాడారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్‌లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసిందని చెప్పారు. అదేవిధంగా మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. 

టీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. పలు ఆఫర్లను ప్రకటిస్తూ.. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా కృషి చేస్తోంది. కొత్త బస్సు సర్వీసులను ప్రవేశపెడుతూ.. మెరుగైన వసతులు కల్పిస్తోంది. ఇటీవలె రూట్ పాస్ సర్వీస్‌ను తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ.. హైదరాబాద్‌లోని టూరిస్ట్ ప్రాంతాలన్నింటిని చూసేలా సరికొత్త ప్యాకేజీని ప్రకటిచింది. 

హైదరాబాద్ దర్శన్ పేరుతో ఈ ప్యాకేజీలో భాగంగా కేవలం 12 గంటల్లో హైదరాబాద్‌లోని టూరిస్ట్ ప్రాంతాలలో పర్యటించే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఏసీ, నాన్ ఏసీ బస్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే శని, ఆది వారాల్లో హైదరాబాద్ దర్శన్ అందుబాటులో ఉంటుంది. మీరు హైదరాబాద్‌లో ప్రాంతాలన్నీ పర్యటించాలని అనుకుంటే.. www.tsrtconline.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Also Read: Telangana- Andhra Super fast Railway: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఈ మార్గాల్లో రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్

అదేవిధంగా స్నాక్ బాక్స్‌ను విధానాన్ని కూడా టీఎస్ఆర్టీసీపీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మధ్యలో తిరుగుతున్న 9 ఎలక్ట్రిక్‌ ఈ గరుడ బస్సుల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తే.. అన్ని సర్వీలకు విస్తరిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 30 రూపాయలు వసూలు చేయనుంది.  

Also Read: LPG Cylinder Price Cut: నేటి నుంచి కొత్త రూల్స్ అమలు.. గ్యాస్ రేటు తగ్గింపు.. ఆ ధరలు పెంపు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
tsrtc management Green signal for pending DA Release to tsrtc employees with june salary
News Source: 
Home Title: 

TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. పెండింగ్ డీఏకు గ్రీన్ సిగ్నల్
 

TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. పెండింగ్ డీఏకు గ్రీన్ సిగ్నల్
Caption: 
TSRTC DA Arrears (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. పెండింగ్ డీఏకు గ్రీన్ సిగ్నల్
Ashok Krindinti
Publish Later: 
No
Publish At: 
Thursday, June 1, 2023 - 17:29
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
54
Is Breaking News: 
No
Word Count: 
295