TSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సరికొత్త సూపర్ లగ్జరీ బస్సులు.. ప్రత్యేకతలు ఇవే..

TSRTC Super Luxury Buses: తెలంగాణ ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్. సరికొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. సూపర్ లగ్జరీ బస్సులను టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. రేపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభంకానున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2022, 08:14 PM IST
  • తెలంగాణలో సరికొత్త సూపర్ లగ్జరీ బస్సులు
  • రేపు మంత్రి అజయ్‌ కుమార్‌ చేతుల మీదుగా ప్రారంభం
  • 2023 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి..
TSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సరికొత్త సూపర్ లగ్జరీ బస్సులు.. ప్రత్యేకతలు ఇవే..

TSRTC Super Luxury Buses: ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో యాజమాన్యం నూతన బస్సులను కొనుగోలు చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్‌ లగ్జరీ, 130 డీలక్స్,  16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. ఈ బస్సులన్నీ మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై కొన్ని కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, రవాణా, రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్దా ప్రకాష్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 

సూపర్‌ లగ్జరీ బస్సుల ప్రత్యేకతలు..

కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్‌ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. 

ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యురిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం (ఎఫ్‌డీఏఎస్) ఏర్పాటు చేశారు. బస్సులో మంటల చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగిన అలారం ఆటోమెటిక్‌గా మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్‌డీఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు.

Also Read: Nasal Vaccine: కొత్త వేరియంట్ భయందోళనలు.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ వచ్చేసింది..   

Also Read: Manchu Family Pays Tribute to Kaikala : కైకాల మరణం.. ప్రశాంత్ నీల్ సంతాపం.. మంచు ఫ్యామిలీ ట్వీట్లు వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News