గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!

Last Updated : Oct 31, 2019, 11:25 AM IST
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!

హైదరాబాద్: సకల జనుల సమర భేరి సభలో పాల్గొన్న బాబు అనే ఓ ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతిచెందడం సభా ప్రాంగణం వద్దకు భారీగా తరలివచ్చిన ఆర్టీసీ కార్మికులను విషాదానికి గురిచేసింది. కరీంనగర్-2 డిపోకు చెందిన డ్రైవర్ బాబు సరూర్ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సకల జనుల సమర భేరిలో పాల్గొనేందుకు వచ్చారు. ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతుండగానే బాబుకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అక్కడే వున్న తోటి కార్మికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాబు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

సమ్మె, సమ్మె తదనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు బాబును తీవ్ర ఆందోళనకు గురిచేశాయని, ఆ బాధతోనే బాబుకు గుండెపోటు వచ్చిందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీ డ్రైవర్‌ బాబు మృతి పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు.

Trending News