TSRTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్... హైదరాబాద్ సిటీ బస్సుల్లో 2 గంటల ఉచిత ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుందంటే..

TSRTC Free Travel Offer: స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎన్నో ఆఫర్స్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 17, 2022, 08:42 AM IST
  • తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్
  • తార్నాక ఆసుపత్రికి వచ్చేవారికి తిరుగు ప్రయాణం ఉచితం
  • ఆర్టీసీ బస్సుల్లో 2 గంటల పాటు ఫ్రీ ట్రావెల్ సౌకర్యం
 TSRTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్... హైదరాబాద్ సిటీ బస్సుల్లో 2 గంటల ఉచిత ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుందంటే..

TSRTC Free Travel Offer: తెలంగాణ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారికి.. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించింది. ఈ సదుపాయం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే 2 గంటల పాటు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యులు రాసిచ్చే ప్రిస్క్రిప్షన్‌పై.. పేషెంట్ అక్కడికి వచ్చిన సమయాన్ని సూచిస్తారు. సదరు పేషెంట్ ఆ చీటిని ఆర్టీసీ బస్సులో చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రత్యేకంగా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్‌కి వచ్చేవారికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఎంజీబీఎస్, జేబీఎస్ లేదా ఇతర చోట్ల ఎక్కడ బస్సు దిగినా సిటీ బస్సుల్లో 2 గంటల పాటు ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రంగారెడ్డి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తెలిపారు. 

ప్రస్తుతం తెలంగాణలో వజ్రోత్సవాల సందర్భంగా తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి వెళ్లేవారికి తిరుగు ప్రయాణంలో టీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. అయితే దీన్ని వజ్రోత్సవాలకే పరిమితం చేయకుండా ఇకముందు కూడా కొనసాగించాలని తాజాగా నిర్ణయించింది. ఈ నిర్ణయం చాలామందికి ఉపయోగపడనుంది.  

Also Read: Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ కేసులో ట్విస్ట్.. న్యూడ్ వీడియోపై సీబీఐ విచారణ? వైసీపీలో కలవరం

Also Read: Horoscope Today August 17th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల పంట పండినట్లే...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News