TS Inter Supplementary Exams Date 2022: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం (జూన్ 28) ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం, రెండో సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 5,90,327 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో దాదాపు 37 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కాగా.. రెండో సంవత్సరం ఫలితాలలో 33 శాతం మంది ఫెయిల్ అయ్యారు. ఇక ఇంటర్‌లో పాస్ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. జూన్ 30 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు.
మరోవైపు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో మార్కులు తక్కువగా వచ్చినా లేదా ఫెయిల్ అయినా విద్యార్థులు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జూన్ 20 నుంచి రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా విద్యార్థులు తమ మార్కుల విషయంలో అనుమానం ఉంటే.. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బార్డర్ పాస్ మార్కుల కంటే 1-2 తక్కువ వచ్చిన వారికి ఇది ఉపయోగపడనుంది. ఇక తక్కువగా మార్కులు వచ్చిన వారికి ఇంప్రూవ్ మెంట్ రూపంలో మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.
Also Read: Flipkart Offer: రూ. 8 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 699కే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి