TS Inter 2nd Year Results 2021 Direct Link: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ మీకోసం

Telangana Inter 2nd Year Results 2021 Direct Link: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఫస్టియర్ ఫెయిల్ అయిన వారిని 35 మార్కులతో సెకండియర్‌లో పాస్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2021, 05:15 PM IST
TS Inter 2nd Year Results 2021 Direct Link: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ మీకోసం

Telangana Inter 2nd Year Results 2021 Direct Link: తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలు వచ్చేశాయి. తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు 2021 (TS Inter 2nd Year Results 2021) విడుదలయ్యాయి. ఉదయం నిర్ణీత సమయానికి ఫలితాలు విడుదలకపోవడంతో ఈ వారాంతంలోగా రిజల్ట్స్ విడుదల కానున్నాయని అధికారులు చెప్పారంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. సెకండియర్ పరీక్షకు ఫీజులు చెల్లించిన  4,51,585 అందరూ పాస్ అయినట్లు ప్రకటించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులో ఏ గ్రేడ్ 1,04,886 మంది విద్యార్థులు, గ్రేడ్‌ -బి 61,887 మంది, గ్రేడ్ సి 1,08,093 మంది విద్యార్థులకు వచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షల ఫలితాలు సాయంత్రం 5 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ మార్కులను సెకండియర్ మార్కులుగా ప్రకటిస్తూ ఫలితాలు విడుదల చేశారు. తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ (www.tsbie.cgg.gov.in)లో ఫలితాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.

Also Read: TS Inter 2nd Year Results 2021: తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

ఫస్టియర్ ఫెయిల్ అయిన వారిని 35 మార్కులతో సెకండియర్‌లో పాస్ చేశారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేయడం తెలిసిందే. విద్యార్థుల మార్కుల మెమోలో తప్పులు దొర్లితే టోల్ ఫ్రీ నెంబర్‌ 040 24600110లో సంప్రదించాలని సూచించారు. TS Inter 2nd Year Results కోసం క్లిక్ చేయండి.

లింక్ 2:  Telangana Inter 2nd Year Results Direct Link

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News