TS e Challan Portal: డ్రైవర్‌కు యూనిఫాం లేదని కారుకు జరిమానా.. ట్వీట్‌ చూసి నాలుక్కరుచుకున్న పోలీసులు

Telangana Traffic Police Wrong Fine: తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహం నెట్టింట వైరల్‌ అవుతోంది. అనాలోచితంగా జరిమానా విధించిన వైనం చర్చనియాంశంగా మారింది. బాధితుడి ట్వీట్‌తో చలానా తీరును మార్చేసిన అంశం మరింత ఆలోచింపజేస్తోంది. జరిమానాల టార్గెట్‌ రీచ్‌ కావడం కోసం వాహన యజమానులను ఇలా మానసిక వేదనకు గురిచేస్తారా? అంటూ జనం మండిపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 08:43 PM IST
  • తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహం
  • అనాలోచితంగా జరిమానా విధించిన వైనం సోషల్ మీడియాలో వైరల్
  • ట్రాఫిక్ పోలీసుల తీరుపై మండిపడుతున్న నెటిజెన్స్
TS e Challan Portal: డ్రైవర్‌కు యూనిఫాం లేదని కారుకు జరిమానా.. ట్వీట్‌ చూసి నాలుక్కరుచుకున్న పోలీసులు

Telangana Traffic Police Wrong Fine: తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహం నెట్టింట వైరల్‌ అవుతోంది. అనాలోచితంగా జరిమానా విధించిన వైనం చర్చనియాంశంగా మారింది. బాధితుడి ట్వీట్‌తో చలానా తీరును మార్చేసిన అంశం మరింత ఆలోచింపజేస్తోంది. జరిమానాల టార్గెట్‌ రీచ్‌ కావడం కోసం వాహన యజమానులను ఇలా మానసిక వేదనకు గురిచేస్తారా? అంటూ జనం మండిపడుతున్నారు. భాస్కర్‌ రెడ్డి తుమ్మల అనే వ్యక్తికి చెందిన కారుకు ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. ట్రాఫిక్‌ పోలీస్‌ వెబ్‌పోర్టల్‌లో దీనికి సంబంధించిన వివరాలు అప్‌లోడ్‌ చేశారు. రోడ్డుమీద కారు వెళ్తున్న ఇమేజ్‌ అటాచ్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... ఎల్లమ్మ టెంపుల్‌, ఫజుల్‌ నగర్‌ ప్రాంతంలో ఇవాళ ఉదయం 10 గంటలకు ట్రాఫిక్‌ పోలీసులు ఈ కారు యజమాని నిబంధనలు ఉల్లంఘించినట్లు జరిమానా విధించారు. కారు డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి యూనిఫాం ధరించలేదని ఆ చలానా వివరాల్లో పేర్కొన్నారు. 
ts-e-challan-viral-news-Hyderabad-traffic-police-news.jpg

ట్రాఫిక్‌ పోలీస్‌ పోర్టల్‌లో దీనిని గమనించిన వాహన యజమాని ట్విట్టర్‌లో తెలంగాణ పోలీసులకు ప్రశ్నలు సంధించారు. ట్రాఫిక్‌ పోలీస్‌ పోర్టల్‌లో జరిమానాకు సంబంధించిన ఫోటోలను స్క్రీన్‌షాట్‌ తీసి ట్వీట్‌కు జోడించారు. ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా ఎందుకు విధించారో అర్థం కావడం లేదని, నా సొంతకారును నడిపేందుకు యూనిఫామ్‌ ధరించాలన్న నిబంధన ఇప్పుడే వింటున్నానని పేర్కొన్నారు. తన ట్వీట్‌ను తెలంగాణ డీజీపీకి, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులతో పాటు.. తెలంగాణ సీఎంఓకు, తెలంగాణ పోలీసులకు ట్యాగ్‌ చేశారు. 

ts-e-challan-viral-news-Hyderabad-traffic-police-newss.jpg
ట్విట్టర్‌లో కారు యజమాని ప్రశ్నించిన కాసేపటికే ట్రాఫిక్‌ పోలీస్‌ పోర్టల్‌లో నిబంధనలు ఎలా ఉల్లంఘించారన్న దగ్గర యూనిఫామ్‌కు బదులు సీట్‌ బెల్ట్‌ అని మార్చేశారు. 

Telangana-Traffic-Police-ts-e-challan-viral-news-Hyderabad-traffic-police-newss.jpg

అయితే, ఈ మొత్తం వ్యవహారంలో మరో కొసమెరుపు ఏంటంటే.. ట్రాఫిక్‌ పోలీసులు ఫోటో తీసి చాలానా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన ఇమేజ్‌ను గమనిస్తే డ్రైవర్‌ సీట్‌బెల్ట్‌ పెట్టుకున్నారా ? లేదా ? అనేది కూడా స్పష్టంగా కనిపించడం లేదు. దీనిపై కూడా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నెటిజెన్స్ ఈ పోస్టుపై మీమ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. దీంతో మొత్తానికి ట్రాఫిక్ పోలీసుల తప్పిదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also read : Building collapse in yadadri: యాదాద్రిలో కుప్పకూలిన భవనం, నలుగురు మృతి

Also read : Harish Rao Comments on Rahul Gandhi: రాహుల్‌గాంధీపై హరీష్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News