Electricity charges : తెలంగాణలో త్వరలోనే విద్యుత్ ఛార్జీల పెంపు.. ఎంతో తెలుసా?

Electricity charges will hike in telangana : తెలంగాణలో గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ డిస్కమ్‌లు కోరాయి. దీంతో త్వరలోనే విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2021, 09:45 PM IST
  • తెలంగాణలో త్వరలో విద్యుత్‌ ఛార్జీల పెంపు
  • విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఇప్పటికే ప్రతిపాదనలు
  • గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచే అవకాశం
Electricity charges : తెలంగాణలో త్వరలోనే విద్యుత్ ఛార్జీల పెంపు.. ఎంతో తెలుసా?

TS Discoms propose power tariff hike electricity charges will hike in telangana : తెలంగాణలో త్వరలో విద్యుత్‌ ఛార్జీలు పెరగనున్నాయి. విద్యుత్‌ ఛార్జీల పెంపుపై డిస్కమ్‌లు (Telangana power distribution companies) ఇప్పటికే టీఎస్ ఈఆర్‌సీకి (Telangana State Electricity Regulatory Commission) (TSERC) ప్రతిపాదనలు పంపాయి. ఏఆర్‌ఆర్‌.. టారిఫ్‌ (tariff) ప్రాతిపదికన ప్రతిపాదనలు పంపాయి. ఈ మేరకు గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ డిస్కమ్‌లు (discoms) కోరాయి. 

ఇక ఛార్జీల పెంపు వివరాలను శ్లాబుల వారీగా వెబ్‌సైట్‌లో ఉంచుతామని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఇక హెచ్‌టీ వినియోగదారులకు యూనిట్‌కు రూపాయి దాకా పెంచేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. కొత్తగా విద్యుత్ ఛార్జీలను పెంచడంతో డిస్కంలకు 6831 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. 

ఇక ఈ విషయం గురించి తెలంగాణ ఎస్పీడీఏసీఎల్ (Telangana SPDACL) సీఎండీ రఘుమారెడ్డి పలు విషయాలు వెల్లడించారు. రైల్వే ఛార్జీలు.. బొగ్గు, బొగ్గు రవాణా ఛార్జీలు పెరగడం వల్ల కరెంట్ ఛార్జీలు (Current charges) పెంచాల్సి వస్తుందన్నారు. గత ఐదేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. అయితే ఇప్పుడు పెంచక తప్పట్లేదన్నారు.

Also Read : Omicron Scare: రాష్ట్రంలో మరో 12 మందికి ఒమిక్రాన్​ పాజిటివ్​- మొత్తం కేసులు @ 55

వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని గుర్తు చేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు (SC and ST domestic consumers) 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. హెయిర్ కటింగ్ సెలూన్స్‌కు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ (Electricity) అందిస్తున్నామన్నారు. అలాగే తెలంగాణ  (Telangana) లో పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్‌కు 2 రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు.

Also Read : Upasana Konidela: యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న మెగా కోడలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News