TS Congress: పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు మీదుంది. అంతేకాదు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. బీఆర్ఎస్ పార్టీలోని నేతలకు గాలం వేస్తూ వాళ్లకు ఎంపీ టికెట్స్ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి.. తిరిగి సొంత గూటికి చేరుకున్న దానం నాగేందర్ కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కట్టబెట్టింది. మరోవైపు బీఆర్ఎస్ తరుపున వరంగల్ ఎంపీగా అభ్యర్ధిగా ప్రకటించబడిన కడియం కావ్య .. అనూహ్యంగా బీఆర్ఎస్ తరుపున పోట నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఆ తర్వాత తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 17 ఎంపీ సీట్లలో 14 ఎంపీ టికెట్స్‌ను ప్రకటించింది. మరో మూడు ఎంపీ సీట్ల కోసం తర్జన భర్జన పడుతోంది. హైదరాబాద్, కరీంగనర్, ఖమ్మం ఎంపీ టికెట్స్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే హైదాబాద్ ఎంపీగా ప్రముఖ బాట్మింటన్ ప్లేయర్ సానియా మీర్జా పేరును వినిపించింది. కానీ ఆమె నుంచి ఎటువంటి ఉలుకు పలుకు లేదు.
ఈమె హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ప్రత్యర్ధిగా బరిలో దిగుతుందా అనేది చూడాలి. మరోవైపు బీజేపీ తరుపున కొంపెట్ట మాధవి లత పోటీ చేస్తూ అసదుద్దీన్‌కు చుక్కలు చూపెడుతోంది. ఈమె అసదుద్దీన్‌పై గెలిస్తే చరిత్రే అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్ పార్టీలో మిగిలిన కరీంనగర్, ఖమ్మం అభ్యర్ధులపై సస్పెన్స్ కొనసాగుతోంది. కరీంనగర్ కాంగ్రెస్ తరుపున రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ఈ టికెట్ పై బీసీ, రెడ్డి, వెలమ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో కరీంనగర్ ఎంపీ టికెట్ పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇందులో రాజేందర్ రావు, ప్రవీణ్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తారంటూ ప్రచారం కూడా జరిగింది.
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్‌పై ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. తెర మీదకు రోజుకో పేరు వస్తోంది. బీసీ, రెడ్డి, వెలమల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ టికెట్‌ను హైకమాండ్ మళ్లీ పెండింగ్‌లోనే పెట్టింది. ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు మధ్య పోటీ నెలకొంది. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తారంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం ఏ సీటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు బీజేపీ తరుపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బరిలో ఉన్నారు.
అటు ఖమ్మం లోక్‌సభ సీటులపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 100 శాతం గ్యారంటీగా గెలిచే స్థానం అని చెప్పాలి. సామాజిక సమీకరణాలు ఇతరత్రా కారణాల వల్ల ముందుగా ఈ సీటుపై భట్టి విక్రమార్క భార్య నందిని పోటీ చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే భట్టి అన్నయ్య మల్లు రవికి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్ధిగా సీటు ఖరారైన నేపథ్యంలో భట్టి పక్కకు తప్పుకున్నాడు. మరోవైపు ఈ సీటుపై అధిష్టానం నుంచి ముందుగానే హామి తీసుకున్న పొంగులేటి శ్రీనివాసస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి ఈ సీటు దాదాపు ఖాయమనే ముచ్చట వినబడుతోంది. తెలంగాణలో ఎంపీ ఎన్నికలు మే 13న నాల్గో విడతలో జరగనుంది. మరోవైపు ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనున్నారు.
Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్: కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook