Telangana Rains Alert: మళ్లీ వడగండ్ల వానలు కురిసే అవకాశం

Telangana Rains Alert: ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వానలు కురిసే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానలకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నాలుగు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వడగండ్ల వానలు కురిశాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2023, 05:26 AM IST
Telangana Rains Alert: మళ్లీ వడగండ్ల వానలు కురిసే అవకాశం

Telangana Rains Alert: తెలంగాణ రాష్ట్రంలో శనివారం, ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకొన్ని చోట్ల ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపటి ఆదివారం తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుండి 40 కిమి వరకు ఉండే అవకాశం ఉంది.

ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వానలు కురిసే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానలకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నాలుగు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వడగండ్ల వానలు కురిశాయి. ఓవైపు భారీ వర్షాలు కురవడంతో రైతులు నష్టపోయిన పంటలు ఒక ఎత్తయితే.. మరోవైపు వడగండ్ల వానలతో రైతులు నష్టపోయిన పంటలు మరో ఎత్తు. 

వడగండ్ల వానలకు మొత్తం కోతకు వచ్చిన వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి, కోతకు సిద్ధంగా ఉన్న వరి చేన్లలో వరి కంకులు నేల రాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వడగండ్ల వాన అంటే రైతులు హడలిపోతున్నారు. వడగండ్ల వాన పేరెత్తితేనే రైతుల ముఖాల్లో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

ఇదిలావుంటే, శుక్రవారం రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం బలహీన పడింది. శుక్రవారం నాటి ద్రోణి విచ్చిన్నతి, శనివారం జార్ఖండ్ నుండి చత్తీస్గడ్, విదర్భ, తెలంగాణ, ఉత్తర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి : Revanth Reddy Protests: రాహుల్ గాంధీపై మోదీ సర్కారు కుట్ర

ఇది కూడా చదవండి : Revanth Reddy Slams PM Modi: రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు అసలు కారణం అదే..

ఇది కూడా చదవండి : CM KCR: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. చరిత్రలో నేడు చీకటి రోజు: సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News