ఇంటర్ ఫలితాల వివాదం: గ్లోబరీనా సంస్థపై కేటీఆర్ స్పందన

ఇంటర్ ఫలితాల వివాదం: గ్లోబరీనా సంస్థపై కేటీఆర్ స్పందన

Last Updated : Apr 29, 2019, 12:05 AM IST
ఇంటర్ ఫలితాల వివాదం: గ్లోబరీనా సంస్థపై కేటీఆర్ స్పందన

హైదరాబాద్: ఇంటర్ ఫలితాలు వెల్లడించే కాంట్రాక్ట్ పొందిన గ్లోబరీనా సంస్థతో తనకు సంబంధం ఉందని వస్తోన్న ఆరోపణలపై టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఇంటర్ ఫలితాల వివాదం తెరపైకొచ్చే వరకు అసలు ఆ గ్లోబరీనా సంస్థ గురించి తనకేమీ తెలియదని కేటీఆర్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వంలో ఏ పదవి లేకుండానే ఏ హోదాలో మీరు ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్నారని, అలాగే కలెక్టర్లు సైతం ప్రభుత్వం సాధించే విజయాలను మీకు ట్యాగ్ చేస్తున్నారని ట్విటర్ ద్వారా ఓ నెటిజెన్ కేటీఆర్‌ను ప్రశ్నించారు. అంతేకాకుండా గ్లోబరీనా సంస్థతో మీకు సంబంధాలున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీరేమని స్పందిస్తారని సదరు నెటిజెన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కేటీఆర్ ఈ వివరణ ఇచ్చారు.

 

Trending News