Munugode Bypoll : మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. విజయదశమికి అటు ఇటుగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్శిస్తూనే.. గతంలో తమ పార్టీ నుంచి బయటికి వెళ్లిన నేతలను తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో నేతల జంపింగ్ లు జోరందుకున్నాయి. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి. తమ గ్రామ ప్రజా ప్రతినిధి ఏ పార్టీలో ఉన్నారంటే గ్రామస్తులు చెప్పలేని దుస్తితి. గంటగంటకు సమీకరణలు మారిపోతుండటంతో జనాలే ముక్కున వేలేసుకుంటున్నారు.
ఉదయం ఒక పార్టీలో ఇనన్ లీడర్.. సాయంత్రానికి జంప్ అవుతున్నారు. అయితే జంప్ అయిన పార్టీలో కొనసాగుతారో లేదో కూడా క్లారిటీ ఉండటం లేదు. మరో పార్టీ నుంచి మంచి ఆఫర్ వస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా కండవు మార్చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో అంతా తానే వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. గట్టుప్పల్ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్ గులాబీ గూటికి చేరారు. గట్టుపల్ ఎంపీటీసీ భాస్కర్ 10 రోజుల క్రితమే చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశంతో కలిసి టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. తిరిగి మంత్రి సమక్షంలో కారు ఎక్కేశారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. నెల రోజుల క్రితమే ప్రభుత్వం గట్టుపల్ ను మండలం ప్రకటించడంతో... మంత్రి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కొన్ని రోజులకే చండూరు జడ్పీటీసీతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. భాస్కర్ బీజేపీలో చేరడంపై గ్రామంలో నిరసన వ్యక్తమైంది. ఆయనకు వ్యతిరేకంగా కొందరు చావు డప్పు తీశారు. తాజాగా ఆయన మళ్లీ అధికార పార్టీలోకి వచ్చేశారు. గట్టుప్పల్ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్ నెల రోజుల్లోనే మూడు పార్టీల కండువాలు మార్చడం నియోజకవర్గంలో చర్చగా మారింది.
తాజాగా మునుగోడులో బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలంలో కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మండల బిజెపి అధ్యక్షుడే జంప్ చేశారు. బీజేపీ మర్రిగూడ మండల ప్రెసిడెంట్ చెరుకు శ్రీరాములు, మండల కార్యదర్శితో పాటు సరంపేట ఉప సర్పంచ్ కొత్త మల్లయ్య మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నాంపల్లి మండలం మహమ్మాదాపురం ఎంపీటీసి మంజుల కారు పార్టీలో జాయిన్ అయ్యారు.సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత కు తాజా చేరికలు నిదర్శనమన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం,అభివృద్ధి ని చూసే టీఆర్ఎస్ లోకి వలసల ప్రవాహం కొనసాగుతుందన్నారు.
Read also: షమీని ఎందుకు జట్టులోకి తీసుకోలేదు.. సిరాజ్ అంత తోపా! బీసీసీఐ ఫాన్స్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.