Telangana Rastra Samithi | తెలంగాణ రాష్ట్ర సమితీ పార్టీలో కీలక సమావేశం త్వరలో జరగనుంది. పార్టీకి చెందిన పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ బుధవారం రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలి అని ముఖ్యమంత్రి కోరారు.
Also Read | Free BSNL Sim: సిమ్ కార్డును ఉచితంగా ఇవ్వనున్న బిఎస్ఎన్ఎల్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ( GMHC Elections 2020 ) త్వరలో జరగనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరింది. దుబ్బాక ఎన్నికల ( Dubbaka ) తరువాత బీజేపీ అధిష్టానం గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇలాంటి సమయంలో ఆ ఎన్నికల ప్రభావం మున్సిపల్ ఎలక్షన్స్ పడకుండా ఉండేలా తెరాస జాగ్రత్తలు తీసుకుంటోంది.
Also Read | FasTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?
జీహెచ్ ఎంసి ఎన్నికల షెడ్యూల్ ను ఇవాళ తెలంగాణ ( Telangana ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి విడుదల చేశారు.
అందులో కీలక అంశాలు
* నవంబర్ 18న నామినేషన్ ప్రారంభం
* నవంబర్ 20న నామినేషన్ చివరి తేదీ
* నవంబర్ 21న నామినేషన్ ల పరిశీలన
* డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలు
* డసెంబర్ 3న అవసరమైన చోట రీఎలెక్షన్స్
* డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR