Hyderabad Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..ఏ ఏ ప్రాంతాల్లో అంటే..!

Hyderabad Traffic: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈనెలాఖరులో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 26, 2022, 08:50 PM IST
  • హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
  • పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు
  • వెల్లడించిన నగర పోలీసులు
Hyderabad Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..ఏ ఏ ప్రాంతాల్లో అంటే..!

Hyderabad Traffic: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈనెలాఖరులో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వీటిని గుర్తించి తగిన మార్గాల్లో వెళ్లాలని సూచించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈనెల 28న(మంగళవారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు రాజ్‌భవన్‌లో కార్యక్రమం జరుగుతుంది.

ఈసందర్భంగా మంగళవారం రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌ వెల్లడించారు. ఈనెల 28న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొనప్ప ఐలాండ్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి వీవీ విగ్రహాం జంక్షన్ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. మొనప్ప ఐలాండ్, వీవీ విగ్రహాం జంక్షన్, పంజాగుట్ట, రాజ్‌భవన్‌ క్వార్టర్స్‌ రోడ్డు మార్గంలో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఇందుకు తమకు సహకరించాలని నగర పోలీసులు పిలుపునిచ్చారు. రాజ్‌భవన్ రోడ్డులో పార్కింగ్ స్థలాలను సైతం ఖరారు చేశారు. గేట్‌-3 నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వరకు జడ్జీలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాహనాలు, దిల్ ఖుష గెస్ట్ హౌస్‌లో మీడియా వాహనాలకు కేటాయించారు.

ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్‌లో వీఐపీ, గవర్నమెంట్ అధికారుల వాహనాలు ఆగనున్నాయి. మెట్రో రెసిడెన్సీ టూ నాసర్ స్కూల్ లైన్‌లో సింగిల్ లైన్ పార్కింగ్‌ ఉండనుంది. లేక్‌వ్యూ నుంచి వీవీ విగ్రహాం వరకు సింగిల్ లైన్ పార్కింగ్‌కు కేటాయించారు. ఈమేరకు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌ అధికారిక ప్రకటన వెలువరించారు.

Also read: Ranji Trophy 2021-22: రంజీ ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్‌..ఆటగాళ్ల భావోద్వేగం..!

Also read:T-Hub 2.0 at Hyd: తెలంగాణలో అందుబాటులోకి మరో మణిహారం..ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News