Traffic Restrictions: నేడు Hyderabad‌ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు

Traffic Restrictions In Hyderabad On January 26, 2021: నేడు (మంగళవారం) హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఓ ప్రకటనలో తెలిపారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 26, 2021, 09:56 AM IST
  • నేడు హైదరాబాద్‌ నగరంలో అమలుకానున్న ట్రాఫిక్ ఆంక్షలు
  • హైదరాబాద్‌లోనూ అన్నదాతలు నేడు శాంతియుతంగా తమ నిరసన
  • సరూర్‌నగర్‌ స్టేడియం నుంచి ఉప్పల్‌ స్టేడియం వరకు వాహన ర్యాలీ
Traffic Restrictions: నేడు Hyderabad‌ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు

Traffic Restrictions In Hyderabad On January 26, 2021: రైతులు తమ నిరసనను గత కొన్ని రోజులుగా తెలుపుతున్నారు. ఈ క్రమంలో నేడు 72 గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ సమస్యను దేశమంతా గుర్తించాలని భావిస్తూ నేడు ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇదివరకే ప్రభుత్వం నుంచి ర్యాలీకి అనుమతి తీసుకున్నారు. హైదరాబాద్‌లోనూ అన్నదాతలు నేడు తమ నిరసనను శాంతియుతంగా తెలపనున్నారు.

రైతుల వాహన ర్యాలీ సందర్భంగా నేడు (మంగళవారం) హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions In Hyderabad) విధించారు. రైతులకు మద్దతుగా సరూర్‌నగర్‌ స్టేడియం నుంచి ఉప్పల్‌ స్టేడియం వరకు చేపడుతున్న టూ వీలర్స్, కార్లు, ఆటోలతో ప్రదర్శనగా ర్యాలీ కారణంగా జనవరి 26న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వివాదంలోనూ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చిన WhatsApp

హైదరాబాద్‌ నుంచి వరంగల్‌, విజయవాడ ప్రాంతాల వైపు వెళ్లేవారు సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌ స్టేడియం మీదుగా కాకుండా మరో ప్రత్యామ్నాయ మార్గం నుంచి వెళ్లాలని సూచించారు. అదే విధంగా ఎల్బీనగర్‌ (LB Nagar) రింగ్‌ రోడ్డు, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు నుంచి ట్రాఫిక్‌ మళ్లింపు(Traffic Restrictions) చేస్తామని లేదా అవసరాలకు అనుగుణంగా వాహనాల్ని అనుమతించడం జరగదని చెప్పారు.

Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు, వెండి ధరలు 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News